Share News

కొండన్నకు మద్దతిద్దాం..కూటమిని గెలిపించుకుందాం

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:28 PM

టీడీపీలోకి చేరికలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో చేరుతున్న అభిమానులను కొండయ్య ఆత్మీయంగా స్వాగతిస్తున్నారు. అందులో భాగంగా వేటపాలెం మండలం అక్కాయిపాలెంకు చెందిన పలువురు యువకులు సోమవారం పార్టీ కార్యాలయంలో కొండయ్యను కలసి మద్దతు తెలిపారు.

కొండన్నకు మద్దతిద్దాం..కూటమిని గెలిపించుకుందాం
కొండయ్యకు మద్దతు తెలుపుతున్న అక్కాయిపాలెం యువకులు

చీరాల, ఏప్రిల్‌ 15 : టీడీపీలోకి చేరికలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో చేరుతున్న అభిమానులను కొండయ్య ఆత్మీయంగా స్వాగతిస్తున్నారు. అందులో భాగంగా వేటపాలెం మండలం అక్కాయిపాలెంకు చెందిన పలువురు యువకులు సోమవారం పార్టీ కార్యాలయంలో కొండయ్యను కలసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. అప్పుడే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని, అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు.

వేటపాలెం మండలం పాపాయిపాలెంలో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య గెలుపొందాలని కోరుతూ కొండయ్య కుమారుడు గౌరీ అమర్‌నాథ్‌ నాయకులు, కార్యకర్తలను కలసి కో రారు. అందులో భాగంగా నూతనంగా పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని సాదరంగా స్వాగతించారు. భవిష్యత్‌ కార్యాచరణపై సూచనలు చేశారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కూటమి అభ్యర్థి కొండయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు.. అభివృద్ధికి మలుపు అం టూ నినాదాలు చేశా రు. ఈ కార్యక్రమాల్లో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

కొండయ్య గెలుపే అందరి లక్ష్యం

టీడీపీ నేత డాక్టర్‌ హేమలత

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నుంచి విరమణ

కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య గెలుపే లక్ష్యంగా సమష్టిగా ముందుకు సాగుతామని టీడీపీ నేత డాక్టర్‌ సజ్జా హేమలత చెప్పారు. స్థానిక లైఫ్‌ ఆసుపత్రిలో సోమవారం కూటమి అభ్యర్థి కొండయ్యతో కలసి ఆ మె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ పార్టీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కూటమి అభ్యర్థిగా టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన కొం డయ్య గెలుపు అనేది ముందస్తుగా అనివార్యమన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న తన ఆలోచనను విరమించు కున్నట్లు డాక్టర్‌ హేమలత ప్రకటించారు. దీంతో టీడీపీ లో నెలకొన్న అంతర్గత పోరు కు తెరపడినట్లయింది. నిన్న, మొన్నటి వరకు డాక్టర్‌ హేమలత అడుగులపై పార్టీలోని కొన్ని వర్గాల్లో సందిగ్ధం నెలకొంది. తాజా గా హేమలత అధిష్ఠాన నిర్ణయం అంతిమంగా శిరోధార్యమని చెప్పడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం వ్యక్తమవుతోంది. కూటమి భాగమస్వాములైన జనసేన, బీజేపీ శ్రేణులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మొత్తమ్మీద కూటమి పార్టీలు, భావస్వారూప్యం కలిగిన ప్రతి ఒక్కరూ కొండయ్య గెలుపుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్నవారు స్పష్టం చేశారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు నాతాని ఉమామహేశ్వరరా వు, ఎన్నికల పరిశీలకుడు ముప్పవరపు వీరయ్యచౌదరి, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సమష్టిగా అడుగులు వేద్దాం

సత్ఫలితాలు సాధిద్దాం : కొండయ్య

వేటపాలెం(చీరాల) : సమష్టిగా అడుగులు వేద్దాం. సత్ఫలితాలు సాధిద్దామని కూటమి అభ్యర్థి కొండయ్య పిలుపునిచ్చారు. ప్రధాన కూడలిలోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్ర హానికి టీడీపీ సీనియర్‌ నాయకురాలు డాక్టర్‌ సజ్జా హేమలత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు ముప్పవరపు వీరయ్య, సీనియర్‌ నాయకుడు నాశిక వీరభద్రయ్య తదితరులతో కలసి పూలమాలలువేసి నివాళులర్పించారు. అ నంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇం టింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు, బీసీ డిక్లరేషన్‌ ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:28 PM