Share News

రాక్షస పాలనకు స్వస్తి చెబుదాం

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:08 AM

రానున్న ఎన్నికలతో రాష్ట్రంలో రాక్షస పాలనకు స్వస్తి చెప్పాలని టీడీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు.

రాక్షస పాలనకు స్వస్తి చెబుదాం

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 28 : రానున్న ఎన్నికలతో రాష్ట్రంలో రాక్షస పాలనకు స్వస్తి చెప్పాలని టీడీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణానికి చెందిన వంద రజక కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి ఆపార్టీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి పచ్చకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ బలుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం టీడీపీ ఏర్పడిందన్నారు. వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను స్థానికుడినని, నిరంతరం మీకు అందుబాటులో ఉండి ప్రజాసంక్షేమం కోసం పాటుపడతానన్నారు. పార్టీలో చేరిన వారిలో నర్సాపురం లక్ష్మీరంగయ్య, చలిజాముల కాదరయ్య, తిమ్మనపల్లె గురువయ్య, తురిమెళ్ల సురేష్‌, కొమరోలు శ్రీనివాసులు, మోక్షగుండం అంకయ్య, దద్దనాల పెద్దగురువయ్య, అలసందలపల్లె రామాంజనేయులు, తూర్పునాటి గోపాల్‌, పుల్లలచెరువు పుల్లయ్య, తదితరులు ఉన్నారు.

మాగుటూరు నుంచి పది కుటుంబాల చేరిక

అర్థవీడు మండలం మాగుటూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు కేసనపల్లి నారాయణ ఆఽధ్వర్యంలో పది కుటుంబాలు టీడీపీలో చేరాయి. ముత్తుముల అశోక్‌రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో తాడి శ్రీను, కేసనపల్లి గురునాఽథం, వెంకటేష్‌, ఇప్పర్ల శ్రీను, బత్తిని శ్రీను, తిరుపతయ్య, గోరా కాశీరావు తదితరులు పాల్గొన్నారు.

బీసీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం

గిద్దలూరు టౌన్‌ : గిద్దలూరు ఎన్‌డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ముత్తుముల అశోక్‌రెడ్డికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని సాయిబాబా కల్యాణ మండపంలో బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి అశోక్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో అనేక మంది బీసీ లపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బీసీలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో నియోజకవర్గంలోని బీసీలు ముత్తుముల అశోక్‌రెడ్డి విజయానికి కృషి చే యాలన్నారు.

బీసీలకు సంపూర్ణ సహకారం అందిస్తా : ముత్తుముల

తాను బీసీల సంక్షేమం కోసం శాసనసభ్యునిగా ఉన్న సమయంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్‌రెడ్డి చెప్పారు. రానున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుం దన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాలు పేదల ఇళ్లలో వెలుగులు నింపుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం యూత్‌ అధ్యక్షులు కుమ్మరి క్రాంతికుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ నాయకులు డాక్టర్‌ జేవీ.నారాయణ, బిల్లా రమేష్‌, ఆవులమంద శ్రీనివాసులు, వేములపాటి చంటి, విశ్వబ్రాహ్మణ సేవా సంఘం బంగారు శ్రీనివాసాచారి, అలసందలపల్లి రామాంజనేయులు, రమణ పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే ప్రతిఒక్కరూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేయాలని టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి భార్య ముత్తుముల పుష్పలీల, మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గిద్దలూరు మండలం సంజీవరా యునిపేట గ్రామంలో రెండవ రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తుముల పుష్పలీల, మాగుంట చందనరెడ్డి టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రా లు పంపిణీ చేశారు. గిద్దలూరు అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి శాసనసభ అభ్యర్థిగా ముత్తుముల అశోక్‌రెడ్డికి, పార్లమెంటు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బుడత మదుసూదన్‌యాదవ్‌, పట్టణ కౌన్సిలర్‌ పాలుగుళ్ల శ్రీదేవి పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 01:08 AM