Share News

బీసీలను దారుణంగా మోసగించిన జగన్‌రెడ్డి

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:32 PM

బీసీలను జగన్‌రెడ్డి దారుణంగా మోసం చేశారని, బీసీలంతా ఒక్కటై ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. మండలంలోని పెదగంజాం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవులదొడ్డికొత్తగొల్లపాలెం గ్రామంలో బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు వాటుపల్లి ఏడుకొండలు అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఏలూరి మాట్లాడారు.

బీసీలను దారుణంగా మోసగించిన జగన్‌రెడ్డి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి

ఐదేళ్లలో దాడులు..అక్రమ కేసులు

ఓటుతో బుద్ధి చెప్పండి

ఎమ్మెల్యే ఏలూరి పిలుపు

చినగంజాం, ఏప్రిల్‌ 15 : బీసీలను జగన్‌రెడ్డి దారుణంగా మోసం చేశారని, బీసీలంతా ఒక్కటై ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. మండలంలోని పెదగంజాం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవులదొడ్డికొత్తగొల్లపాలెం గ్రామంలో బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు వాటుపల్లి ఏడుకొండలు అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఏలూరి మాట్లాడారు. రాజకీయం అనేది పది మందికీ ఉపయోగపడాలే తప్ప మనల్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకునేందుకు కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలతో వ్యాపారం చేసే వైసీపీని తరలికొట్టాలన్నారు. బీసీలకు అండగా ఉండే టీడీపీని గెలిపించాలని ఏలూరి విజ్ఞప్తి చేశారు. బీసీల అభ్యున్నతకి టీడీపీ డిక్లరేషన్‌ ప్రకటించినట్లు తెలిపారు. జగన్‌రెడ్డి వచ్చినప్పటి నుంచీ బీసీలపై చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. యాదవులను అణగదొక్కిన చరిత్ర హీనుడు జగన్‌ అన్నారు. గత టీడీపీ హయాంలో మత్స్యకారులకు వలలు, పడవలు, ఇతర పరికరాలను 90 శాతం రాయితీపై అంచినట్లు గుర్తు చేశారు. చినగంజాం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలుపుతానని ఏలూరి అన్నారు. పెదగంజాం గ్రామస్థుల చిరకాల స్వప్నం ఎన్టీఆర్‌ వారధిని నిర్మించి ప్రజలకు ఇచ్చిన మాట నిలపెట్టుకొని మీ ముందుకొచ్చానన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందించేలా చర్యలు తీసుకుంటానన్నారు. టీడీపీ అధికారంలోనికి వచ్చిన వెంటనే మత్స్యకారుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామన్నారు. టీడీపీ ఇచ్చిన పథకాలు తప్ప మత్స్యకారులకు వైసీపీ ఇచ్చిన పథకం ఏదీ లేదన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. అద్భుతమైన ఇండస్ర్టీని రూపకల్పన చేసి 5000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 ఏళ్లగా 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి నా బీసీలు అంటూ జగన్‌ మభ్యపెడుతున్నారన్నారు. ఈ ఐదేళ్లలో బీసీలను అణగదొక్కడం, వారిపై అక్రమ కేసులు పెట్టడం, హత్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. జగన్‌రెడ్డి కపట ప్రేమని బీసీలంతా గ్రహించాలని ఏలూరి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:32 PM