Share News

ఎర్రగుడిపాడులో గోవా మద్యం డంప్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:24 AM

న్నికల నేపఽథ్యం లో పంపిణీ నిమిత్తం వైసీపీ నాయకులు గో వా నుంచి ప్రత్యేకంగా తెప్పించి, నిల్వచేసిన మద్యం డంపు దొరికిపోయింది. ఎస్‌ఈబీ అధికారులు ఆదివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

ఎర్రగుడిపాడులో గోవా మద్యం డంప్‌

దాడి చేసి పట్టుకున్న ఎస్‌ఈబీ అధికారులు

1001 బాటిళ్లు స్వాధీనం

వైసీపీ నాయకుడిపై కేసు

చీమకుర్తి, ఏప్రిల్‌ 28: ఎన్నికల నేపఽథ్యం లో పంపిణీ నిమిత్తం వైసీపీ నాయకులు గో వా నుంచి ప్రత్యేకంగా తెప్పించి, నిల్వచేసిన మద్యం డంపు దొరికిపోయింది. ఎస్‌ఈబీ అధికారులు ఆదివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. పక్కా సమా చారంతో ఏఎస్పీ, ఎస్‌ ఈబీ ఈఎస్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఈబీ అధికారులు ఈ దాడులను జరిపారు. ఎస్‌ఈబీ ఏఈఎస్‌ రవికు మార్‌ చీమకుర్తి ఎస్‌ఈబీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డంప్‌ వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు గ్రా మంలోని మాజీ సర్పంచ్‌, వైసీపీ నాయకుడు గంగిరేకుల వెంకట్రావుకు చెందిన ఆవుల ఫాం షెడ్‌లో గోవా నుంచి మద్యం బాటిళ్లను అక్రమంగా తరలించి నిల్వ ఉంచారు. ఎస్‌ఈబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో 1,001 బాటిళ్లను స్వాధీనపరుచుకొని షెడ్‌ ఓనర్‌ వెంకట్రావుపై కేసు నమోదు చేసినట్లు రవికుమార్‌ తెలిపారు. వైసీపీ మండల నాయకుల ప్రమేయం ఈ మద్యం డంపు నిల్వలో ఉంద న్న ఆరోపణలపై రవికుమార్‌ స్పందిస్తూ నిందితుడి కాల్‌డేటా ఆధారంగా విచారణ జరిపి ఆధారాలు లభించిన మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో ఎస్‌ఈబీ సీఐలు మారయ్యబాబు, వంశీధర్‌, దుర్గాప్రసాద్‌లు, ఎస్‌ఐలు వినీతారెడ్డి, ఆరేటి శ్రీనివాసరావు, సిబ్బంది షరీఫ్‌, రామిరెడ్డి, రామచంద్ర, సురేష్‌, నక్కా శ్రీనివా సరావులు పాల్గొన్నారు. కాగా ఈ మద్యం నిల్వలు మంత్రి, ఎస్‌ఎన్‌పాడు అభ్యర్థి మేరుగ నాగార్జునవేనని ప్రచారం నడుస్తోంది.

Updated Date - Apr 29 , 2024 | 01:24 AM