Share News

టంగుటూరులో వైసీపీకి భారీ షాక్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:58 PM

మండల కేంద్రం టంగుటూరులో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. ఇన్‌కం ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కురుగుంట్ల శిల్వన్‌రాజు సహచరి స్నేహలత వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆమెతోపాటుగా టంగుటూరులోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన 100 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్నేహలతతోపాటుగా పార్టీలో చేరిన అందరికీ టీడీపీ కండువాకప్పి ఆహ్వానించారు. ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్నేహలత వైసీపీ నుంచి గ్రామ సర్పంచ్‌గా పోటీచేసి టీడీపీ మద్దతుదారు మద్దిరాల మమత చేతిలో ఓటమిపాలయ్యారు.

టంగుటూరులో వైసీపీకి భారీ షాక్‌
స్నేహలతకు టీడీపీ కండువా కప్పి నమస్కరిస్తున్న ఎమ్మెల్యే స్వామి

టంగుటూరు, ఏప్రిల్‌ 28 : మండల కేంద్రం టంగుటూరులో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. ఇన్‌కం ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కురుగుంట్ల శిల్వన్‌రాజు సహచరి స్నేహలత వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆమెతోపాటుగా టంగుటూరులోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన 100 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్నేహలతతోపాటుగా పార్టీలో చేరిన అందరికీ టీడీపీ కండువాకప్పి ఆహ్వానించారు. ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్నేహలత వైసీపీ నుంచి గ్రామ సర్పంచ్‌గా పోటీచేసి టీడీపీ మద్దతుదారు మద్దిరాల మమత చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి టంగుటూరులో వైసీపీ నాయకురాలుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఈప్రాంతానికి వచ్చిన నాటి నుంచి కురుగుంట్ల కుటుంబంతో అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్నారు. దీంతో స్నేహలత వైసీపీని వీడడం ఆపార్టీకీ తీరని లోటుకానుంది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్నేహలత టీడీపీలో చేరిక టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి దోహదపడుతుందన్నారు. దామచర్ల సత్య మాట్లాడుతూ స్నేహలత టీడీపీలో చేరడం ద్వారా ఆమె కుటుంబ భవిష్యత్‌కు బంగారు బాటలు పడ్డాయన్నారు. తెలుగుదేశం ప్రవేశ పెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి టీడీపీ అభ్యర్థుల విజయంలో భాగస్వాములు కావాలని కోరారు. మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ టీడీపీతో భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మద్దిరాల మమత, కురుగుంట్ల స్నేహలత, మాజీ సర్పంచ్‌ బెల్లం జయంత్‌బాబు, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్‌, మధుసూదనరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కామని విజయకుమార్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు బెజవాడ వెంకటేశ్వర్లు, పెద్డోడు, యజమాని, కామని శ్రీను, కుందేటి వెంకట్రావు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:58 PM