Share News

టీడీపీ హయాంలోనే బీసీలకు గుర్తింపు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:58 AM

బీసీలకు రాజకీయంగా గుర్తింపు తీసుకొచ్చి అన్ని విధాలా అండగా నిలిచింది టీడీపీనేనని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్‌ అన్నారు. మండలంలోని పాకల తీరంలో సోమవారం రాత్రి నిర్వహించిన టీడీపీ నియోజకవర్గస్థాయి బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ స్థాపించక ముందు బలహీనవర్గాల పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పారు. 1983లో ఎన్టీఆర్‌ పార్టీని పెట్టిన తర్వాతనే బీసీలు పెద్దసంఖ్యలో చట్టసభలకు ఎన్నికవ్వడం ప్రారంభమైందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు కోకొల్లలుగా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో బీసీలకు ఇచ్చిన 30 పథకాలను రద్దుచేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలోనే బీసీలకు గుర్తింపు
టీడీపీ బీసీ డిక్లరేషన్‌ సభకు హాజరైన జనసందోహం (ఇన్‌సెట్లో) బీసీ డిక్లరేషన్‌ సభలో మాట్లాడుతున్న పార్టీ సీనియర్‌ నాయకుడు బీద రవిచంద్ర

పార్టీ జాతీయ ప్రధాన కర్యదర్శి బీద

వైసీపీ పాలనలో పాతాళానికి తొక్కారు

స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్‌ను

కుదించారని ధ్వజం

చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని

చేసుకోవాలని పిలుపు

సింగరాయకొండ, ఏప్రిల్‌ 15 : బీసీలకు రాజకీయంగా గుర్తింపు తీసుకొచ్చి అన్ని విధాలా అండగా నిలిచింది టీడీపీనేనని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్‌ అన్నారు. మండలంలోని పాకల తీరంలో సోమవారం రాత్రి నిర్వహించిన టీడీపీ నియోజకవర్గస్థాయి బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ స్థాపించక ముందు బలహీనవర్గాల పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పారు. 1983లో ఎన్టీఆర్‌ పార్టీని పెట్టిన తర్వాతనే బీసీలు పెద్దసంఖ్యలో చట్టసభలకు ఎన్నికవ్వడం ప్రారంభమైందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు కోకొల్లలుగా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో బీసీలకు ఇచ్చిన 30 పథకాలను రద్దుచేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో టీడీపీ 34 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తే వైసీపీ ప్రభుత్వంలో 24 శాతానికి కుదించిందన్నారు. దీంతో బీసీలు స్థానిక సంస్థల్లో 18,600 పదవులు కోల్పోయారని రవిచంద్ర వివరించారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండాలంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని, ఆబాధ్యత అత్యధికంగా బీసీలపైనే ఉందన్నారు. కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్ధి మాగుంట, కొండపి ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిలను గెలిపించాలని కోరారు.

బీసీ ద్రోహి జగన్‌ : ఎమ్మెల్యే స్వామి

బీసీలను అన్నివిధాలా అణచివేసిన ద్రోహి జగన్‌రెడ్డి అని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 2,700 మందిపై దాడులు జరిగాయని, వేలాదిమందిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలపై దాడులను నియంత్రించేందుకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.

బీసీలు అన్ని విధాలా నష్టపోయారు : ఎమ్మెల్సీ రామారావు

వైసీపీ పాలనలో బీసీలు అన్ని విధాలా నష్టపోయారని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. బీసీలంటే.. టీడీపీ అని.. టీడీపీ అంటే బీసీలని చెప్పారు. జగన్‌పాలనలో బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ బీసీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే మరలా టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన చేస్తున్న వైసీపీని సాగనంపాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీనేనని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ పోలిశెట్టి, నియోజకవర్గ పరిశీలకుడు అడకా స్వాములు, బీజేపీ, జనసేన నియోజకవర్గ కన్వీనర్లు బాలకోటయ్య, మనోజ్‌, టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, పోకూరి రవీంద్రబాబు, నరసారెడ్డి, సర్పంచ్‌ సైకం చంద్రశేఖర్‌, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బత్తుల నారాయణస్వామి, బీసీ సెల్‌ నాయకులు నందికనుమ బ్రహ్మయ్య, మించల బ్రహ్మయ్య, చీమకుర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:59 AM