Share News

టీడీపీ అధికారంలోకి రాగానే రూ.4వేలు పింఛన్‌

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:56 AM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అవ్వతాతలకు నెల నెలా ఇంటికే రూ. 4వేలు పింఛన్‌ ఇవ్వనున్నట్లు టీడీపీ కూటమి ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు మండలం చింతాయగారిపాలెం గ్రామంలో జనం కోసం జనార్దన్‌ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా దామచర్ల ప్రజలతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంతోపాటు, గ్రామాలలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్‌లు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 2600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

టీడీపీ అధికారంలోకి రాగానే రూ.4వేలు పింఛన్‌
చింతాయగారిపాలెంలో మాట్లాడుతున్న జనార్దన్‌

- త్రోవగుంట నుంచి భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 15 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అవ్వతాతలకు నెల నెలా ఇంటికే రూ. 4వేలు పింఛన్‌ ఇవ్వనున్నట్లు టీడీపీ కూటమి ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు మండలం చింతాయగారిపాలెం గ్రామంలో జనం కోసం జనార్దన్‌ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా దామచర్ల ప్రజలతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంతోపాటు, గ్రామాలలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్‌లు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 2600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వేసవిలోనూ తాగునీటి ఎద్దడి లేకుండా తగు ప్రణాళికతో సమస్య పరిష్కరించినట్లు తెలిపారు. సైకో జగన్‌ పాలన వచ్చిన తర్వాత గ్రామాలలో కనీస అభివృద్ధి కరువైందన్నారు. ఉపాధి లేక, పంటలకు గిట్టుబాటు ధరలు లేక, విద్యుత్‌ చార్జీల భారంతో అన్నదాతలు, గ్రామీణ ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. ఇక్కడి వైసీపీ నేత సీనియర్‌గా చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కనీస అభివృద్ధి చేయకపోగా, భూకబ్జాలు, ఆక్రమణలు, ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు, అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తప్ప ప్రజల సంక్షేమ పట్టించుకోని వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వచ్చేనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి, టీడీపీ కూటమి తరుపున పోటీచేస్తున్న తనకు ఎమ్మెల్యేగా మరో అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు, పలువురు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

త్రోవగుంటలో వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి..

త్రోవగుంట గ్రామంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండవ రాఘవరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో త్రోవగుంట ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు జొన్నాడ సామ్యేలు, రాయపాటి చంద్ర, బొచ్చు పేతురు, గడతోటి గోపి, తలతోటి అజయ్‌, జేమ్స్‌, గరికిమొక్కల రాములు, అనిల్‌, కోటపూరి చిరంజీవి,రాయపాటి సామ్యేలుతోపాటు మరో వందమంది వైసీపీ నుంచి టీడీపీలో చేరగా దామచర్ల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో యర్రంనేని లక్ష్మీనారాయణ, నావూరి కుమార్‌, కామేపల్లి శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:56 AM