Share News

LokSabha Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు వేళాయే..

ABN , Publish Date - Apr 16 , 2024 | 05:25 PM

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల రణరంగంలో అసలు సిసలు ఘట్టం నామినేషన్ల పర్వం. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 18వ తేదీన ఈ పర్వం ప్రారంభం కానుంది.

LokSabha Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు వేళాయే..

హైదరాబాద్/అమరావతి, ఏప్రిల్ 16: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల రణరంగంలో అసలు సిసలు ఘట్టం నామినేషన్ల పర్వం. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 18వ తేదీన ఈ పర్వం ప్రారంభం కానుంది. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. అందుకోసం తమ అనుచర గణాన్ని సిద్దం చేసుకుంటున్నారు.

IPS ABV Issue: ఏబీవీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు ఎప్పుడంటే?

నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ఆయా అభ్యర్థులు.. సమాయత్తమవుతున్నారు. ఏప్రిల్ 18వ తేదీన నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్లు స్వీకరణకు ఆఖరు తేదీ. ఏప్రిల్ 26వ తేదీ నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 29వ తేదీ నామినేషన్లు ఉప సంహరించుకొనేందుకు చివరి రోజు.


TS Politics: ‘ఒవైసీ బ్రదర్స్‌ను చంపేందుకు బుల్లెటో.. జైలో అవసరం లేదు’.. రాజాసింగ్ సంచలన కామెంట్స్

మే 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో.. ఒకే దశలో పోలింగ్ జరగనుంది. దేశంలో మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఆ క్రమంలో ఏప్రిల్ 19వ తేదీన అంటే.. నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇక జూన్ 1వ తేదీన తుది దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఏ రాజకీయ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనేది ఆ రోజు స్పష్టంకానుంది.

ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. వారికి భీఫారమ్ కూడా అందశాయి. ఏప్రిల్ 18వ తేదీన నామినేష్ వేయడమే తరువాయి. అనంతరం ఆయా అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఉదృతిని మరింత పెంచనున్నారు.

KS Jawahar:తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి వెంటనే బహిష్కరించాలి

అందులోబాగం ఓటర్లపై వారు హామీల వర్షం కురిపించ నున్నారు. ఆ క్రమంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓటరు ఎవరికి పట్టం కడతాడనేది మాత్రం మే 13వ తేదీన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ముందు నుంచుని ఓటు వేసే వరకు ఓటరకు ఓ స్పష్టత అయితే రాదనేది సుస్పష్టం. దీంతో జూన్ 4వ తేదీన జరిగే ఎన్నికల లెక్కింపులో ఎవరు, ఏ పార్టీ అభ్యర్థిని విజయం వరిస్తుందో తెలియనుంది.

తెలంగాణ వార్తలు కోసం..

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 16 , 2024 | 05:41 PM