Share News

‘రాష్ట్రంలో వైసీపీ దుకాణం ఖాళీ’

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:14 AM

ప్రజా వ్యతిరేక పాలన వల్ల రాష్ట్రంలో వైసీపీ దుకాణం ఖాళీ అవుతోందని నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్ధి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

‘రాష్ట్రంలో వైసీపీ దుకాణం ఖాళీ’

నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్‌ 28: ప్రజా వ్యతిరేక పాలన వల్ల రాష్ట్రంలో వైసీపీ దుకాణం ఖాళీ అవుతోందని నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్ధి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. ఆదివారం టీడీపీ నాయకుడు, 12వ వార్డు మున్సిపల్‌ స్వతంత్ర కౌన్సిలర్‌ ఖండే శ్యామ్‌సుందర్‌ లాల్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల్లో వ్యాపార, రాజకీయ వేత్తలైన శిల్పా కుటుంబాలకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్థి సంస్థ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వెదుర్ల రామచంద్రారావు, ఏవీఆర్‌ ప్రసాద్‌, తాతిరెడ్డి తులసిరెడ్డి, ఎన్‌ఎండీ ఫిరోజ్‌, ఆర్యవైశ్య ప్రముఖులు బింగుమళ్ల శ్యామ్‌సుందర్‌ గుప్తా, ఖండే ఆనంద్‌గురూజీ, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:14 AM