Share News

వారంలోపు పేర్లను నమోదు చేసుకోండి

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:56 PM

సాధారణ ఎన్నికలు-2024 నేపథ్యంలో పోలింగ్‌ రోజున పోలింగ్‌ స్టేషన్‌లలో హెల్పర్లుగా విధులు నిర్వహించాలనుకున్న ఎన్‌సీసీ (నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌) మాజీ సైనిక్‌ ఉద్యోగులు, రిటైర్డు పోలీసులు వారి పేర్లను వారం రోజుల్లోపు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డా.జి. సృజన తెలిపారు.

వారంలోపు పేర్లను నమోదు చేసుకోండి

కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి.సృజన

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 15: సాధారణ ఎన్నికలు-2024 నేపథ్యంలో పోలింగ్‌ రోజున పోలింగ్‌ స్టేషన్‌లలో హెల్పర్లుగా విధులు నిర్వహించాలనుకున్న ఎన్‌సీసీ (నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌) మాజీ సైనిక్‌ ఉద్యోగులు, రిటైర్డు పోలీసులు వారి పేర్లను వారం రోజుల్లోపు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డా.జి. సృజన తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్‌సీసీ మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డు పోలీసులతో కలెక్టర్‌ సమావేశం నిర్వ హించి మాట్లాడుతూ ఎన్‌సీసీ వారికి రాజకీయ పార్టీలకు సంబంధం ఉండకూ డదని అన్నారు. నమోదైన పేర్లను పోలీసు శాఖ పరిశీలిస్తుందని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కే.మధుసూదన్‌రావు, ఎన్నికల సూపరిం టెండెంట్‌ మురళి, సైనిక వెల్ఫేర్‌ అధికారి, మాజీ సైనిక్‌ ఉద్యోగులు, రిటైర్డు పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:56 PM