Share News

ఎమ్మెల్యే శిల్పా హామీలు కాగితాలకే పరిమితం: బుడ్డా

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:04 AM

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎంపీ అభ్యర్థి శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే శిల్పా హామీలు కాగితాలకే పరిమితం: బుడ్డా
వెలుగోడు రోడ్‌ షోలో మాట్లాడుతున్న బుడ్డా రాజశేఖరరెడ్డి

వెలుగోడు, ఏప్రిల్‌ 28: ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎంపీ అభ్యర్థి శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు వెలుగోడు పట్టణంలో రోడ్‌ షో నిర్వహించారు. బుడ్డా మాట్లాడుతూ జనసేన, బీజేపీ అండతో శ్రీశైలంలో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. ఇందుకు ప్రజలు ఒక్క నెలరోజుల పాటు కష్టపడితే.. ఐదేళ్ల పాటు మీకోసం పాటుపడుతానని భరోసా ఇచ్చారు. శబరి మాట్లాడుతూ..బుడ్డా రాజన్నతో నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ బుడ్డా రాజశేఖరరెడ్డిని, బైరెడ్డి శబరిని గెలిపించుకోవాల్సి అవసరం ఉందన్నారు. టీడీపీ నాయకులు రజాక్‌, శేషిరెడ్డి, కృష్ణుడు, కలాం, ఖలీల్‌, జాకీర్‌ హుసేన్‌, ఖలీల్‌, భూపాల్‌, రామానాయుడు, చంద్ర, జనసేన నాయకులు శ్రీరాములు, అభిమన్యుడు, షాలు బాషా, బీజేపీ నాయకులు ప్రతాప్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించారు. ముందుగా సెంటిమెంట్‌ ప్రకారం ఇందిరేశ్వరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టి అక్కడి నుంచి శ్రీపతిరావుపేట, కృష్ణాపురం, అమలాపురం గ్రామాల్లో జరిగిన రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. బుడ్డా మాట్లాడుతూ టీడీపీ హయంలో అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, పంటపొలాలకు రస్తాలు, తాగునీటి ట్యాంకుల నిర్మాణాలు చేపట్టి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించామని అన్నారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు వంగాల శివరామిరెడ్డి, కంచర్ల గోవిందరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, తిరుపమయ్య, కొండలరావు, రవీంద్రనాయక్‌, పుల్లారెడ్డి, శ్రీనివాసులు, నబిరసూల్‌, రవీంద్రబాబు ఆయా గ్రామాల నాయకులు ఉన్నారు.

పట్టణంలోని 1వ వార్డుకు చెందిన ఇటుకల బట్టీ యజమాని షేక్‌ ఖాదర్‌ బాషా, ముర్తుజా ఆధ్వర్యంలో సుమారు 50 ముస్లిం మైనార్టీ కుటుంబాలు కుటుంబాలు వైసీపీ వీడి బుడ్డా రాజశేఖరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. ఖాదర్‌బాషా మాట్లాడుతూ.. తమను వైసీసీలోనే కొనసాగాలని ఆ పార్టీ నాయకులు అనేక విధాలుగా ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడినప్పటికీ తాము మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి నాయకత్వంపై నమ్మకంతో టీడీపీలో చేరినట్లు వివరించారు. పార్టీలోకి చేరిన వారిలో వలి, షేక్షావలి, షాషావలి, ఖాజా, ఖాదర్‌వలి, రోషన్‌, మాలిక్‌, మల్లి, రఫీక్‌, నిరంజన్‌ తదితరులు ఉన్నారు. ఆత్మకూరులోని అర్బన్‌కాలనీకి చెందిన నన్నూరు మద్దిలేటి ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి బుడ్డా శైలజమ్మ సమక్షంలో టీడీపీలో చేరాయి.

శ్రీశైలం: శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి కుమార్తె మేఘనారెడ్డి, తన భర్త జయంత్‌తో కలిసి ఆదివారం సుండిపెంటలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. ప్రచారానికి ముందుగా పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో మేఘనారెడ్డి, జయంత్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కూటమి నాయకులు యుగంధర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, శ్రీనివాసులు, సాయిరాం, మల్లికార్జున, కన్నయ్య, ఉమామహేశ్వరరావు, ప్రవీన్‌తేజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:04 AM