Share News

కలిసికట్టుగా పని చేద్దాం

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:37 AM

జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కలసి కట్టుగా పని చేద్దామని టీడీపీ జిల్లా ఆధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

కలిసికట్టుగా పని చేద్దాం

టీడీపీ జిల్లా నూతన అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 15: జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కలసి కట్టుగా పని చేద్దామని టీడీపీ జిల్లా ఆధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన ఆధ్యక్షుడిగా ప్యాలకుర్తి తిక్కారెడ్డి గత అధ్యక్షుడు బీటీ నాయుడి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పగించిన పని చేయడానికి సిద్ధంగా ఉంటానని అన్నారు. కింది స్థాయిలో అంకిత భావంతో పని చేసే కార్యకర్తలు, నాయకులను కాపాడుకుని వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని తెలిపారు. మంత్రాలయం నియోజవర్గం నుంచి తాను గెలిచే అవకాశం ఉన్నప్పటికి పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు అక్కడ వాల్మీకులు అధికంగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి అవకాశం కల్పించిందని అన్నారు. 24 సంవత్సరాలు జిల్లా ఆధ్యక్షుడిగా పని చేసిన సోమిశెట్టి, ప్రస్తుత ఆధ్యక్షుడు బీటీ నాయుడు, సీనియర్‌ నాయకులు కేఈ క్రిష్ణమూర్తి, కేఈ ప్రభాకర్‌, తుగ్గలి నాగేంద్ర సలహాలు స్వీకరిస్తానని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేసి, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులందరినీ గెలిపించడానికి శాయశక్తులా పనిచేస్తానని అన్నారు. ఈ నెల రోజులు కలిసి కట్టుగా శ్రమించాల్సిన ఆవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అభ్యర్థి టీజీ భరత్‌, ఆకెపోగు ప్రభాకర్‌, తుగ్గలి నాగేంద్ర, డీ. జేమ్స్‌, కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్‌ కైపా పద్మలతారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాయకులు, కార్యకర్తలకు బీటీ నాయుడు ధన్యవాదాలు

జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్యక్షుడిగా పని చేసిన తనకు సహకరించిన టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్సీ బీటీ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్యక్షుడిగా మంత్రాలయం నియోజకవర్గం ఇన్‌చార్జి ప్యాలకుర్తి తిక్కారెడ్డి నియమించడం జరిగిందన్నారు. పార్టీ ఆధ్యక్షుడిగా ఇంత కాలం తనపై నమ్మకంతో ఆధ్యక్ష బాధ్యతలు పార్టీ ఆధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 12:37 AM