Share News

జగనాసుర రక్త చరిత్ర చార్జిషీట్‌ విడుదల

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:34 AM

సీఎం జగన్‌ జగనాసుర రక్త చరిత్ర చార్జిషీట్‌ను బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం బనగానపల్లెలో విడుదల చేశారు.

జగనాసుర రక్త చరిత్ర చార్జిషీట్‌ విడుదల
జగనాసుర రక్త చరిత్ర చార్జిషీట్‌ను విడుదల చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు

బనగానపల్ల్లె, ఏప్రిల్‌ 28: సీఎం జగన్‌ జగనాసుర రక్త చరిత్ర చార్జిషీట్‌ను బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం బనగానపల్లెలో విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి దూకుడు పెంచింది. జగన్‌ అరాచక పాలన అంతం - కూటమి పంతం.. కూటమి రూపొందించిన జగనాసుర రక్త చరిత్ర పేరుతో రూపొందించిన చార్జిషీట్‌ను బనగానపల్లెలో జరిగిన కార్యక్రమంలో బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, యువ నాయకులు కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, వంగల పరమే శ్వరరెడ్డి, టంగుటూరు శ్రీనయ్య, బురానుద్దీన్‌, కాశీంబాబు, రాయలసీమ సలాం తదితరుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. వైసీపీ పెత్తందారీ పాలన లో రాష్ట్రం విధ్వంసం అయిందని, సీఎం జగన్‌కు ఏమాత్రం విశ్వసనీయత, నైతికత లేదని విమర్శించారు. ఐదేళ్ల నిరంకుశ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల భారం మోపాడన్నారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు పాడు చేసి, 30వేల మంది మహిళల మాంగల్యాలను తెంచారన్నారు. 10సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి రూ.75వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. వందకు పైగా గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన టీడీపీ పథకాలు రద్దు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను 600 మందిని వైసీపీ ప్రభుత్వంలో హత్య చేశారన్నారు. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌ రాష్ట్రంగా మార్చి యువతను నిర్వీర్యం చేశారన్నారు. ఇలా ఎన్నో నేరాలు ఘోరాలు చేసినందుకు జగనాసుర రక్త చరిత్ర అంటూ జగన్‌ అరాచక పాలనపై ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో రూపొందించిన చార్జీ షీటును ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నట్లు బీసీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారు: బీసీ

వైసీపీ ఫ్యాన్‌ రెక్కలు ముక్కలవడం ఖాయమని, ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని బీసీ జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం బనగానపల్లె పట్టణంలోని శివనందినగర్‌, పెండేకంటి నగర్‌లలో బసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి ఇంటింటి ప్రచా రం చేశారు. బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి ప్రజలకు మరో 15రోజుల్లో పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్‌ను, ఎమ్మెల్యే కాటసానిరామిరెడ్డిని ఇంటికి పంపడానికి సిద్ధ్దంగా ఉన్నారన్నారు. వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలనలో రాష్టం అన్ని విధాలా నాశనం అయింద న్నారు. ఎస్సీ, ఎస్టీకి చెందిన 28 పథకాలు, బీసీలకు చెందిన 30 పథకాలు, మైనార్టీలకు చెందిన 11 పథకాలు రద్దు చేశారని అన్నారు. 5 ఏళ్లలో మేనిఫెస్టోలో 30 శాతం హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల వారిని వంచించిన వైసీపీని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయడం ఖాయమని బీసీ అన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలను కాటసాని చంద్రశేఖర్‌రెడ్డితో కలసి వివరించారు. బురానుద్దీన్‌, కాశీంబాబు, రాయల సీమ సలాం, కలాం, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, వంగల పరమేశ్వరరెడ్డి, టంగుటూరు శ్రీనయ్య, అధిక సంఖ్యలో బనగానపల్లె పట్టణ టీడీపీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెట్నికోటలో వైపీపీకి షాక్‌: కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామానికి చెందిన గొంగటి హుసేన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆకుల వెంకటశివారెడ్డి, కొప్పుల శివరామిరెడ్డి, నామాల రవీంద్ర, దూదేకుల దస్తగిరి, గొంగటి వెంకట రామిరెడ్డి, నాగిరెడ్డి, పవన్‌ కళ్యాణ్‌రెడ్డి, కుమ్మరి సుబ్బరాయుడు, కదిరి కృష్ణారెడ్డి, కొప్పుల నాగేంద్రారెడ్డి తదితర 30 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి ఆదివారం టీడీపీలో చేరారు. బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో వీరికి బీసీ జనార్దన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

Updated Date - Apr 29 , 2024 | 12:34 AM