Share News

జేబులు నింపుకోడానికే బుగ్గన అభివృద్ధి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:20 AM

డోన్‌ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన చెబుతున్న అభివృద్ధి అంతా జేబులు నింపుకోవడానికే తప్ప.. ప్రజలకు ఒరిగిందేమీ లేదని డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి విమర్శించారు.

 జేబులు నింపుకోడానికే బుగ్గన అభివృద్ధి

చెరువులకు నీళ్లు నింపి రైతులను ఆదుకుంటాం

డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

డోన్‌, ఏప్రిల్‌ 28: డోన్‌ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన చెబుతున్న అభివృద్ధి అంతా జేబులు నింపుకోవడానికే తప్ప.. ప్రజలకు ఒరిగిందేమీ లేదని డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి విమర్శించారు. ఆదివారం మండలంలోని దొరపల్లి, లక్ష్మింపల్లి, మల్లెంపల్లి, బొంతిరాళ్ల గ్రామాల్లో కోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ డోన్‌ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు ఇచ్చింది తామేనన్నారు. ప్రతి గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించామని, పేద విద్యార్థుల కోసం పాఠశాలలు నిర్మించామన్నారు. తాము వేసిన రోడ్ల మీద మంత్రి బుగ్గన మళ్లీ రోడ్లు వేసి డబ్బులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు చెరువు లకు నీరు నింపకుండా మంత్రి బుగ్గన ఏం చేశారని ప్రశ్నించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వ మేనని, చెరువులకు నీరు నింపి రైతులను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, మాజీ ఎంపీపీ శేషఫణి గౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, దేవరబండ వెంకటనారాయణ, భాస్కర్‌ నాయుడు, అభిరెడ్డిపల్లె గోవిందు, జయ న్న యాదవ్‌, సర్పంచ్‌ రామిరెడ్డి, దొరపల్లి నాగరాజుగౌడు, లక్ష్మింపల్లె జనార్దన్‌ పాల్గొన్నారు.

అబద్ధాల మేనిఫెస్టో : కేఈ కృష్ణమూర్తి

సీఎం జగన్‌ ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టోలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం డోన్‌ పట్టణంలో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డితో కలిసి కేఈ ఓ కార్యక్రమానికి హాజర య్యారు. ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల ముందు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మోసపు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారన్నారు. 99 శాతం హామీలు నెరవేర్చానని జగన్‌ మేనిఫెస్టో పచ్చి అబద్ధాలు చెప్పడం ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన జగన్‌ ప్రకటించిన మేనిఫెస్టోను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్ర ప్రజ లకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేలా ఉందన్నారు. పేదలకు సామాజిక పింఛన్‌ చంద్రబాబు రూ.4వేలు ప్రకటిస్తే.. సీఎం జగన్‌ మూడేళ్ల తర్వాత రూ.3,500 ఇస్తానని ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. రైతులను ఆదుకునేందుకు రూ.20వేల ఆర్థిక సాయం ఏడాదికి అంది స్తామని చంద్రబాబు హామీ ఇస్తే.. జగన్‌ రూ.16వేలు ఇస్తామన్నారు. టీడీపీ మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో ఏ మాత్రం పనికిరాదన్నారు. కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లా డుతూ తల్లికి వందనం పథకం కింద ఇంట్లో చదువుతున్న పిల్లలందరికీ రూ.15వేలు చంద్ర బాబు ప్రకటిస్తే.. సీఎం జగన్‌ ఇంట్లో చదివే పిల్లల్లో ఒకరికి మాత్రమే రూ.15వేలు ఇస్తామని చెప్పారన్నారు. వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, వచ్చేది టీడీపీ ప్రభుత్వ మేనన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఆలంకొండ నబీసాబ్‌, ఓబులాపురం శేషిరెడ్డి, మర్రి శ్రీరాములు, ఆలా మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:20 AM