Share News

వైసీపీలో దళితులకు రక్షణ కరువు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:55 AM

వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

వైసీపీలో దళితులకు రక్షణ కరువు

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో 95 కుటుంబాలు టీడీపీలో చేరిక

బనగానపల్లె, ఏప్రిల్‌ 15: వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఒక్క రోజే 95 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. బనగానపల్లె పట్టణానికి చెందిన 40 కుటుంబాలు, సంజామల మండలం బొందలదిన్నెకు చెందిన 45 దళిత కుటుంబాలు బనగానపల్లె టీడీపీ కార్యాల యంలో బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి బీసీ టీడీపీ కడువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా బీసీ జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో వందల మంది దళితులపై దాడులు జరిగాయన్నారు. టీడీపీలో చేరిన వారిలో సంజామల మండలం బొందలదిన్నె గ్రామానికి చెందిన నీసుప్రసాద్‌, నీసుకర్ణ, భాస్కర్‌, వెంకటేశ్వర్లు, యేసుదాసు, నాగేంద్ర, మద్దిలేటి, రంగయ్య, ఏసురత్నం, అశోక్‌ తదితరులు ఉన్నారు. అలాగే బనగానపల్లె పట్టణంలోని కొండపేటకు చెం దిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్‌రహీంనా యక్‌, అబ్దుల్‌ యూసుస్‌ నాయక్‌, జానీబాషా, మాబాషా, నూర్‌బాషా, మాలి, సాధిక్‌, కార్పెంటర్‌ అల్లాబకాస్‌, మగ్బుల్‌బాషా, మహమ్మద్‌ఆలీ రసూల్‌, హుసేన్‌వలి, హుసేన్‌బాషా, సుధాకర్‌, మాలిక్‌బాషా తదితరులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీలో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభిృద్ధి సాధ్యమని అన్నారు. ఈసందర్భంగా బీసీ మాట్లాడుతూ టీడీపీలో చేరిన వారికి సముచి తస్థానం కల్పిస్తామన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:55 AM