Share News

అటవీ సిబ్బంది, భక్తుల మధ్య వాగ్వాదం

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:27 AM

అహోబిలంలో అటవీ సిబ్బందికి, భక్తులకు ఆదివారం వాగ్వాదం జరిగింది.

అటవీ సిబ్బంది, భక్తుల మధ్య వాగ్వాదం

నంద్యాల, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): అహోబిలంలో అటవీ సిబ్బందికి, భక్తులకు ఆదివారం వాగ్వాదం జరిగింది. కడప నుంచి వచ్చిన భక్తులు పావన నరసింహస్వామి క్షేత్రానికి వెళ్తుండగా అటవీ సిబ్బంది వాహనాలను నిలిపి ప్లాస్టిక్‌ వస్తు వులు ఉండకూడదని వాహనాల్లోని వాటర్‌ ప్యాకెట్లు, ప్లేట్లు తీసు కొని వాహనాలకు రూ.2 వేలు గేట్‌ చెల్లించాలని చెప్పి కట్టించు కున్నారు. భక్తులు స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చి తమ దగ్గర నుంచి తీసుకున్న వాటర్‌ ప్యాకెట్లు, పేట్లు తిరిగి ఇవ్వాలని సిబ్బందిని కోరారు. వాటిని ఇవ్వమంటూ సిబ్బంది వాదనకు దిగారు. ఈ సమయంలోనే సిబ్బందికి, భక్తులకు ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం భక్తులు ఎగువ అహోబిలం దర్శనం చేసు కొని తిరిగి వస్తున్న భక్తులను ఫారెస్టు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో భక్తులు ఆళ్లగడ్డ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫారెస్టు సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. ఫారెస్టు సిబ్బందికి, భక్తులకు మధ్య రాజీ చేసి పంపించామని రూరల్‌ ఎస్‌ఐ నరసింహులు చెప్పారు.

Updated Date - Apr 29 , 2024 | 12:27 AM