Share News

హెచ్‌వోడీలతో అడిషనల్‌ డీఎంఈ సమీక్ష

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:59 AM

కర్నూలు ప్రభు త్వ సర్వజన వైద్యశాల ధన్వం తరీ హాల్‌లో ఆసుపత్రిలోని అన్ని విభాగాల హెచ్‌వోడీలు, బయోమెడికల్‌ సిబ్బందితో సోమవారం అడిషినల్‌ డీఎంఈ డా.జి.రఘునందన్‌, సూపరింటెండెంట్‌ వి.వెంకటరంగారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

హెచ్‌వోడీలతో అడిషనల్‌ డీఎంఈ సమీక్ష

కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 15: కర్నూలు ప్రభు త్వ సర్వజన వైద్యశాల ధన్వం తరీ హాల్‌లో ఆసుపత్రిలోని అన్ని విభాగాల హెచ్‌వోడీలు, బయోమెడికల్‌ సిబ్బందితో సోమవారం అడిషినల్‌ డీఎంఈ డా.జి.రఘునందన్‌, సూపరింటెండెంట్‌ వి.వెంకటరంగారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ డా.జి.రఘునందన్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలో బయో మెడికల్‌ ఎక్విప్మెంట్‌పై రివ్యూ చేశామన్నారు. ఆసుపత్రికి సంబంధించి మెడికల్‌ ఎక్విప్మెంట్‌ పరికరాలు 70 శాతం పని చేస్తున్నాయని తెలిపారు. అనంత రం అవుట్‌సైడ్‌ ఇన్వెస్టిగేషన్స్‌ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పలు కేషీట్‌లను పరిశీలించామన్నారు. ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్‌ విభా గంలో అన్ని వైద్యపరీకరాలు పని చేస్తున్నప్పుడు రోగులను బయట పంపించ కుండా చర్యలు తీసుకోవాలని హెచ్‌వోడీలను ఆదేశించారు. ఈ సమీక్షలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చిట్టి నరసమ్మ, వైస్‌ ప్రిన్సిపాల్‌ హరిచరణ్‌, సీఎస్‌ ఆర్‌ ఎంవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో హేమనళిని, ఆర్‌ఎంవో వెంకటరమణ, హెచ్‌వోడీలు శ్రీనివాసులు, రాధారాణి, ఆసుపత్రి అడ్మిని స్ర్టేటర్లు శివబాల నగాంజన్‌, కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:59 AM