Share News

కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి: గౌరు చరిత

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:57 AM

ప్రతి కార్యకర్త సైనికునిలా పని చేయాలని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత పిలుపునిచ్చారు.

కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి: గౌరు చరిత

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 15: ప్రతి కార్యకర్త సైనికునిలా పని చేయాలని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత పిలుపునిచ్చారు. సోమవారం టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని వెంకటాపురం, చెన్నంచెట్టిపల్లె, కొమరోలు, సోమయాజులపల్లె, గుమితం తాండ, కాల్వ గ్రామాల్లో ఇంటింటి ప్రచారంతోపాటు భారీ ర్యాలీ, సభ లు నిర్వహించారు. ఈసందర్భంగా గౌరు చరిత, మల్లెల రాజశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్‌ విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపాలన్నారు. జగన్‌ గులకరాయి డ్రామా ఆడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని, ఇప్పటికే కోడికత్తి, వివేకా హత్య గురించి సీఐడీ తేల్చి చెప్పిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోవిందరెడ్డి, మోహన్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, విశ్వేశ్వరరెడ్డి, చదువుల సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌బాషా, చంద్రపెద్దస్వామి, రాము, దేవేంద్ర, హనుమంతరావు, వెంకటరమణ, తిప్పాయపల్లె సుధాకర్‌ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, భాస్కర్‌ రెడ్డి, వడ్డె వెంకటసుబ్బయ్య, నాగమల్లేష్‌, రామమద్దిలేటి, కురువ కృష్ణ, సంజీవ, లక్ష్మణ్‌ నాయక్‌, రజాక్‌, ఖాదర్‌, కేవీ మధు పాల్గొన్నారు.

ఫ టీడీపీలోకి 40 కుటుంబాలు: మండలంలోని చెన్నంచెట్టిపల్లె గ్రామంలో వైసీపీకి చెందిన 40 కుటుంబాలు గౌరు చరిత, మల్లెల రాజశేఖర్‌ సమక్షంలో సోమవారం టీడీపీలో చేరారు. టీడీపీ నాయకులు నాగమల్లేష్‌, వడ్డె వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో చెన్నంచెట్టిపల్లెలో వైసీపీకి చెందిన నాయకులు వెంకటే శ్వర్లు, కటారు శివ, చిన్ని కృష్ణుడు, తిమ్మారెడ్డి, వీరభద్రుడు, అయోధ్య నాగన్న, నాగయ్య, మదనచంద్ర, నాగశేషులు, మాజీ సర్పంచ్‌ వీరాంజనేయులు, సీఎం వెంకటే శ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, కొమరోలు గ్రామంలో డీలర్‌ శేషిరెడ్డి, పరమేశ్వరరెడ్డి, గోవిందాచారి, బోయ కిరణ్‌, శేఖర్‌ రెడ్డి, నీలకంఠేశ్వరప్ప, వెంకటకృష్ణుడు, మద్ది లేటి, పుల్లయ్యలతోపాటు రెండు గ్రామాల్లో 40 కుటుంబాలు టీడీపీలో చేరారు.

టీడీపీలోకి భారీగా చేరికలు

కల్లూరు: పాణ్యం నియోజకవర్గంలో టీడీపీలోకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుతున్నారు. ఓర్వకల్లు మండలం పూడిచర్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచు రాజన్న అతని అనుచరులతో టీడీపీలో చేరారు. సోమవారం పూడిచర్లకు చెందిన 200 కుటుంబాలతో ఆయన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. నంద్యాల జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మోహ న్‌రెడ్డి, పాలకొలను సుధాకర్‌రెడ్డి, పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, నన్నూరు విశ్వేశ్వరరెడ్డి, పుసులూరు ప్రభాకర్‌రెడ్డి, ఖాజామియ్య పాల్గొన్నారు.

టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: గౌరు వెంకటరెడ్డి

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచే యాలని నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ మహిళా అఽధ్యక్షురాలు కె.పార్వతమ్మ ఆధ్వర్యంలో తన కార్యాలయంలో కల్లూరు అర్బన్‌ 35, 36,37, 41 వార్డుల అబ్జర్వర్‌ మన్నె గౌతమ్‌రెడ్డితో కలిసి గౌరు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టానికి చంద్రబాబును సీఎంగా చేసుకోవడం చారిత్రక అవసరమన్నారు. కార్యక్రమంలో 37వ వార్డు ఇన్‌చార్జి క్రిష్ణవేణమ్మ, 41వ వార్డు ఇన్‌చార్జి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు శివ, రాష్ట్ర బీసీ సెల్‌ సెక్రటరీ కాసాని హహేష్‌గౌడ్‌, పాణ్యం తెలుగు యువత అధ్యక్షుడు జువ్వాజి గంగాధర్‌గౌడ్‌, కుర్వ సాధికార కమిటీ కన్వీనర్‌ ధనుంజయ, క్లస్టర్‌ ఇన్‌చార్జి జనార్దన్‌ ఆచారి పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:57 AM