Share News

AP Elections: కొడాలి నాని అడ్డాలో కుమారీ ఆంటీ..!

ABN , Publish Date - May 10 , 2024 | 01:27 PM

కుమారి ఆంటీ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. రాత్రికి రాత్రి ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఆమె తరచు సోషల్ మీడియాలో అడపా దడపా కనిపిస్తున్నారు. అయితే కుమారి ఆంటీ తాజాగా గుడివాడలో ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు.

AP Elections: కొడాలి నాని అడ్డాలో కుమారీ ఆంటీ..!
Kumari Aunty

కుమారి ఆంటీ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. రాత్రికి రాత్రి ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఆమె తరచు సోషల్ మీడియాలో అడపా దడపా కనిపిస్తున్నారు. అయితే కుమారి ఆంటీ తాజాగా గుడివాడలో ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ఆమె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

తన స్వస్థలం గుడివాడ అని ఈ సందర్బంగా ఆమె తెలిపారు. 15 సంవత్సరాల క్రితం గుడివాడ పట్టణం ఎలా ఉందో.. నేటికి అలాగే ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. పట్టణంలో అభివృద్ధి అనేది లేదన్నారు. అలాగే గుడివాడలోనే తనకు ఉపాధి లభించి ఉంటే... అంత దూరంలో ఉన్నా హైదరాబాద్ మహానగరానికి తాను ఎందుకు వెళ్తానంటూ ఆమె ఈ ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలపై ప్రస్తావించారు.


ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వెనిగండ్ల రాము గెలిస్తే.. గుడివాడ అభివృద్ధి జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి వెనిగండ్ల రామును ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆమె గుడివాడ నియోజకవర్గ ప్రజలకు విజ్జప్తి చేశారు.

Voter ID Download: ఫోన్‌లో ఓటర్ ఐడీ.. ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి

మహర్షి చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రజలకు ఎలా సేవ చేశారో.. అలాగే నిజజీవితంలో వెనిగండ్ల రాము ప్రజలకు సేవ చేస్తున్నారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే నియోజకవర్గంలో యువతకు ఉపాధితోపోటు వైద్య సేవలందించాలని ఈ సందర్భంగా నాయకులకు కుమారి ఆంటీ సూచించారు.


హైదరాబాద్‌, మాదాపూర్‌లోని ఫుడ్ స్టాల్ పెట్టుకొని కుమారీ ఆంటీ జీవనం సాగిస్తుంది. ఈ ఫుడ్ స్టాల్స్ వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆ ప్రాంతంలోని ఫుడ్ స్టాల్స్ తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఈ నిర్ణయంపై ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Live: జగన్ జలగ.. మీ భూమి మీది కాదు: చంద్రబాబు

ఆమె ఆవేదనను స్థానికులు వీడియో తీసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో రాత్రికి రాత్రి ఆమె ఫేమస్ అయిపోయింది. ఈ వీడియో చివరకు సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. దాంతో మాదాపూర్ ప్రాంతంలోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్స్ తొలగించాలనే నిర్ణయన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం.. పోలీసులను ఆదేశించారు.


మరోవైపు గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో ఆయన వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తమ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమ గెలుపునకు శ్రీరామ రక్ష అని ఆయన తన ప్రచారంలో స్పష్టం చేస్తున్నారు. అలాంటి వేళ.. గుడివాడలో ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది తెలియాలంటే.. జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

Read Latest National News And Telugu News

Updated Date - May 10 , 2024 | 01:27 PM