Share News

మచిలీపట్నాన్ని పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతాం: కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:57 AM

అమరావతి రాజధానికి దగ్గరగా ఉన్న మచి లీపట్నం నగరాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతామని, బందరు పోర్టును అభివృద్ధి చేస్తామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు.

మచిలీపట్నాన్ని పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతాం: కొల్లు రవీంద్ర
జ్యుయలరీ పార్కులో కార్మికులతో మాట్లాడుతున్న కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణ

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 15: అమరావతి రాజధానికి దగ్గరగా ఉన్న మచి లీపట్నం నగరాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతామని, బందరు పోర్టును అభివృద్ధి చేస్తామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం బాబు ష్యూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పొట్లపాలెం, పోతేపల్లి గ్రామాలు, జ్యుయలరీ పార్కులో కొల్లు రవీంద్ర పర్యటించారు. పోతేపల్లిలో ఆటో వర్కర్ల పార్కు, జ్యుయలరీ పార్కును ఎన్టీ రామారావు నెలకొల్పారన్నారు. రోల్డుగోల్డు పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెటింగ్‌ పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈనెల 17న చంద్రబాబు మచిలీపట్నం వచ్చినప్పుడు నగర సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. జ్యుయలరీ పార్కులో కార్మికులకు ఆదాయపు వనరులు పెంచేందుకు చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రూ.2.5 కోట్ల నిధులు తెచ్చి రోల్డుగోల్డు నగల తయారీలో మెళకువలపై శిక్షణ ఇప్పించేందుకు భవనాలు నిర్మించామన్నారు. జనసేన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, టీడీపీ బందరు రూరల్‌ మండలం అధ్యక్షుడు కుంచే నాని, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్‌, కాటం మధు, కమ్మిల మధు, అక్కుమహంతి రాజా, శివ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:57 AM