Share News

నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:41 AM

‘‘నలభైఏళ్ల రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఎవరికీ చెడు చేయలేదు. భవిష్యత్తులోనూ చేయను. నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి.’’ అని ఓటర్లను టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ కోరారు.

నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, పక్కన జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, పోతిరెడ్డి అనిత, ముళ్లపూడి నాగేశ్వరరావు

తూర్పుకాపుల ఆత్మీయ సమావేశంలో కూటమి ‘తూర్పు’ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌

కృష్ణలంక, ఏప్రిల్‌ 28: ‘‘నలభైఏళ్ల రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఎవరికీ చెడు చేయలేదు. భవిష్యత్తులోనూ చేయను. నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి.’’ అని ఓటర్లను టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ కోరారు. కృష్ణలంక 21వ డివిజన్‌ పరిధిలో ఆదివారం తూర్పుకాపులతో ఆయన ఆత్మీయ సమా వేశం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని శివనాథ్‌(చిన్ని)ని సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాల వల్లే జగన్‌కు 2019 ఎన్నికల్లో ఓట్లు వేశారని, ఇప్పుడ రాజశేఖ రరెడ్డి ఎక్కడా కనిపించడం లేదని, మొత్తం జగనే కనిపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయిసు ్తన్నారని, ఇసుకను బ్లాక్‌ మార్కెటింగ్‌కు తరలించుకుపోయి జగన్‌ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగుండేదన్నారు. భవన నిర్మాణ రంగం వారికి చేతినిండా పని ఉండేదన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చి రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని దెబ్బ తీశారన్నారు. యువతకు ఉద్యోగాలు లేవని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా రాకపోవడంతో చదువులు పూర్తైనా సర్టిఫికెట్లు కళాశాల యాజ మాన్యాల బీరువాల్లో ఉన్నాయన్నారు. అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు వ్యాపారాలు బాగా జరిగేవన్నారు. జగన్‌ పాలనలో నగరంలో ఎక్కడ చూసినా టూలెట్‌ బోర్డులే కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు నిర్మించిన భవనాల్లో నుంచి జగన్‌ ఈ ఐదేళ్లు పాలించారన్నారు. జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి అమ్మిశెట్టి వాసు, మాజీ కార్పొరేటర్‌ చందన సురేష్‌, టీడీపీ నేతలు గొరిపర్తి నామేశ్వరరావు, వేములపల్లి రంగారావు, పెరుమాళ్ల గురునాథం, జనసేన నాయకులు కొవ్వూరి కిరణ్‌బాబు, పోతిరెడ్డి అనిత, పోతిరెడ్డి రమణ, ముళ్లపూడి నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు పోతిరెడ్డి శంకర్‌, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:41 AM