Share News

ప్రజాసేవకే రాజకీయాల్లోకి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:27 AM

గన్నవరం నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడానికి, మేలు చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ప్రజల్ని దోచుకోవడానికి, వేధించడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు.

ప్రజాసేవకే రాజకీయాల్లోకి
వేమండ ఎన్నికల ప్రచారంలో యార్లగడ్డ వెంకట్రావు

ఉంగుటూరు, ఏప్రిల్‌ 28 : గన్నవరం నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడానికి, మేలు చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ప్రజల్ని దోచుకోవడానికి, వేధించడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇచ్చి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్థి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మండుటెండను సైతం లెక ్కచేయకుండా మండలంలోని పలుగ్రామాల్లో ఎన్డీయే కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేమండ, ఇందుపల్లి గ్రామాలు, సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు నందమూరు, మధిరపాడు, చాగంటిపాడు, వేంపాడు, చికినాల, బొకినాల, తరిగొప్పల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఆయా గ్రామాల్లో ప్రజలు పూలమాలలువేస్తూ, పూలవర్షం కురిపిస్తూ అడు గడుగునా బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యార్లగడ్డ, బాలశౌరి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టబోయే సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషిచేస్తామని స్పష్టమైన హామీలు ఇస్తూ ముందుకు సాగారు. ఎన్నికలకు రెండు వారాలు మాత్రమే సమయమున్నందున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజా క్షేత్రంలో వుంటూ ఎన్డీయే కూటమి గెలుపే లక్ష్యంగా సమన్వయంతో సమిష్టిగా కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆరుమళ్ల వెంకట కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనోక్‌, మండల మహిళా అధ్యక్షురాలు మండవ రమ్య, ఆయా గ్రామపార్టీ నాయకులు కె.శ్రీను, తోట నాగభూషణం, సునీల్‌, లక్ష్మణరావు, ఉయ్యూరు మురళి, వేణు, యోహాను, తుమ్మల రామకృష్ణ, జగదీష్‌, లత, గోగినేని విష్ణువర్థన్‌రావు, సుభానీ, ఆలీ, వలీ, కొలుసు రవీంద్ర, హనుమాన్‌, నాగబాబు, సుబ్బారావు, అనిల్‌, నాగరమేష్‌, మూడుపార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ పాలనలో అన్ని వర్గాలకు మేలు

గన్నవరం : టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయని ఆ పార్టీ టౌన్‌ అధ్య క్షుడు జాస్తి శ్రీధర్‌ అన్నారు. స్థానిక సొసైటీపేటలో కూటమి అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని బాలశౌరిలను గెలిపించాలని కోరుతూ ఆదివారం ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జాస్తి శ్రీధర్‌ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక కార్మికులకు పనులు లేకుండా పోయాయని, వారి నిధిని కూడా పక్కదారి మళ్లించారని, వైసీపీ పాలనలో అన్ని వర్గాలు దెబ్బ తిన్నాయ న్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంద న్నారు. టీడీపీ సీనియర్‌ నాయకులు అరవపల్లి బోస్‌, బుస్సే నాగ ప్రసాద్‌, మద్దినేని వెంకటేశ్వరరావు, షుకూర్‌, జాస్తి తాతారావు, ఆసిఫ్‌ఖాన్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

కూటమితోనే ప్రజాసంక్షేమం

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌ : ప్రజా సంక్షేమమే పరమావధిగాటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాలను కూటమి అధికారంలోకి రాగానే అమలు చేస్తారని టీడీపీ, జనసేన నాయకులు తెలిపారు. కానుమోలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజే పీకూటమి ద్వారా అమలు చేయబోయే పథకాలను వివరిస్తూ కరపత్రా లను పంపిణీ చేశారు. యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయ కులు చెడుగొండి శివశంకర్‌, పొట్లూరి ప్రసాద్‌, చింతల వెంకటశివ అప్పారావు, దన్నే దుర్గారావు, పొన్నంపల్లి సతీష్‌, జనసేన నాయకులు చలమలశెట్టి బుచ్చిబాబు, గరికపాటి శివ, నాని పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:27 AM