Share News

అధికారులు వార్సెస్‌ ప్రొఫెసర్లు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:57 AM

కృష్ణా యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్ల మధ్య యుద్ధం రచ్చకెక్కింది. వర్సిటీలో తనను వేధిస్తున్నారని, అదేమని అడిగితే ప్రభుత్వ పెద్దల సూచనలతోనే ఇదంతా జరుగుతోందం టున్నారని, తాను ఈ నెల 30న యూనివర్సిటీ ఎదుట శాంతియుత పోరాటం చేస్తానని సీనియర్‌ ప్రొఫెసర్‌ ఎంవీ బసవేశ్వరరావు యూనివర్సిటీ అధికారులకు శనివారం లేఖ రాయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన రాసిన లేఖలోని వివరాలు..

అధికారులు వార్సెస్‌ ప్రొఫెసర్లు

కృష్ణా యూనివర్సిటీలో రచ్చకెక్కిన వివాదాలు

ప్రభుత్వ పెద్దలు వేధిస్తున్నారంటూ ఓ ప్రొఫెసర్‌ లేఖ

రేపు రిలేదీక్ష చేస్తానని పిలుపు

ఆయన వెంటే మరికొంతమంది అధ్యాపకులు

కృష్ణా యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్ల మధ్య యుద్ధం రచ్చకెక్కింది. వర్సిటీలో తనను వేధిస్తున్నారని, అదేమని అడిగితే ప్రభుత్వ పెద్దల సూచనలతోనే ఇదంతా జరుగుతోందం టున్నారని, తాను ఈ నెల 30న యూనివర్సిటీ ఎదుట శాంతియుత పోరాటం చేస్తానని సీనియర్‌ ప్రొఫెసర్‌ ఎంవీ బసవేశ్వరరావు యూనివర్సిటీ అధికారులకు శనివారం లేఖ రాయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన రాసిన లేఖలోని వివరాలు..

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ‘అధ్యాపకులంతా కష్టపడి పనిచేస్తేనే యూనివర్సిటీ ఇంతటి స్థాయికి చేరుకుంది. కొంతకాలంగా కొంతమంది ప్రొఫెసర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. అందులో నేను ఉన్నాను. వేధింపులపై ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఈ చర్యలు తీసుకుంటున్నామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరో బయటపెట్టడం లేదు. నన్ను ఎందుకు ఇంతగా వేధింపులకు గురిచేస్తున్నారో తెలియడం లేదు. పరిపాలనాపరంగా అధ్యాపకులు ఏమైౖనా తప్పులు చేస్తే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. తమకు నచ్చిన వారికి పదోన్నతులు ఇస్తూ, నచ్చని వారిని తొక్కి పెడుతున్నారు. లంచం ఇవ్వలేదనే కారణంతో నాకు పదోన్నతి రాకుండా చూశారు. కొంతకాలంగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని యూనివర్సిటీ సంపద తరిగిపోయేలా చేశారు. పరిశోధనా విభాగంలోని విద్యార్థులకు సంబంధించిన సమస్యలను పట్టించుకోవడం లేదు. నన్ను నూజివీడు పీజీ సెంటరుకే పరిమితం చేసి, కృష్ణా యూనివర్సిటీకి రానివ్వడం లేదు. యూనివర్సిటీలో ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగి ఇప్పటికే ప్రతిష్ఠ దిగజారింది. యూనివర్సిటీలో జరుగుతున్న భవనాల నిర్మాణంలో నాణ్యత లోపించిందని చెప్పిన వారిని సంబంధిత బాధ్యతల నుంచి తొలగించారు. వివిధ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ప్రశ్నించిన వారిని సంబంధిత కమిటీలో నుంచి తొలగించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వర్సిటీలో జరుగుతున్న తప్పులను, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఉపకులపతికి వివరించాలని ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదు. ఈ అక్రమాలను నిలువరించాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన యూనివర్సిటీ ఎదుట శాంతియుత పోరాటం చేస్తాను.’ అని ప్రొఫెసర్‌ బసవేశ్వరరావు లేఖ రాశారు. ఈ నెల 30న యూనివర్సిటీ ఎదుట శాంతి యుత పోరాటం చేస్తానని బసవేశ్వరరావు ప్రకటించగా, ఆయనతో పాటు మరికొంతమంది అధ్యాపకులు దీక్షలో పాల్గొనేందుకు సమాయాత్తమవుతున్నారు.

పీజీ పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌ నియామకంలోనూ..

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని నూజివీడు పీజీ సెంటరులో ఎంబీఏ, ఎంకాం నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యాయి. వీటి నిర్వహణకు సంబంధించి చీఫ్‌ సూపరింటెండెంట్‌ గా నూజివీడు పీజీ సెంటరులో తాత్కాలిక పద్ధతిపై పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎస్వీఎం వర్ధన్‌కు బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమవుతోంది. నూజివీడు పీజీ సెంటర్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ 56 రోజుల వ్యవధిలో 21 రోజులే వచ్చారని అక్కడ పనిచేసే అధ్యాపకులు చెబుతున్నారు. ఎక్కువ రోజులు ఆయన కృష్ణ్ణా యూనివర్సిటీలోనే ఉండటంతో నూజివీడు పీజీ సెంటరులో పాలన గాడి తప్పిందంటున్నారు. పీజీ పరీక్షలను అన్ని జాగత్తలతో నిర్వహించాల్సి ఉండగా, కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న అధ్యాపకుడికి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది చెబుతున్నారు. పరీక్షల నిర్వహణలో ఏమైౖనా పొరపాట్లు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:57 AM