Share News

ముదునూరులో వైసీపీకి భారీ షాక్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:30 AM

పెన మలూరు నియోజకవర్గానికి ఈశాన్య గ్రామం గా భావిస్తున్న ముదునూరులో వైసీపీకి భారీగా షాక్‌ తగిలింది. గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరు తున్నారు. దీంతో ఆ పార్టీ నాయకుల్లో కలవరం మొదలైంది.

 ముదునూరులో వైసీపీకి భారీ షాక్‌
ముదునూరులో వైసీపీ నుంచి జనసేనలో చేరుతున్న వైసీపీ శ్రేణులు

ముదునూరు(ఉయ్యూరు), ఏప్రిల్‌ 28 : పెన మలూరు నియోజకవర్గానికి ఈశాన్య గ్రామం గా భావిస్తున్న ముదునూరులో వైసీపీకి భారీగా షాక్‌ తగిలింది. గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరు తున్నారు. దీంతో ఆ పార్టీ నాయకుల్లో కలవరం మొదలైంది. నియోజకవర్గానికి ఈశాన్య దిక్కున ఉన్న ముదునూరు నుంచి ఏపార్టీ నాయకులైన ముందుగా పూజలు చేసి ఏకార్యక్రమానైనా ప్రారం భించడం పరిపాటిగా వస్తుంది. ఈ పరిస్థితుల్లో గ్రామానికి చెందిన పలువురు వైసీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో చేరుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మె ల్యేగా కొలుసు పార్థసారథి విజయం సాధిం చారు. ఆ ఎన్నికల్లో ఆయనకు గ్రామంలో మంచి ఆధిక్యత లభించింది. తదుపరి పరిణామాల్లో పార్థసారథి ఇటీవల టీడీపీలో చేరగా ఆయనతో పాటు వైసీపీకి చెందిన సర్పంచ్‌ మొవ్వ వెంకట నాగలక్ష్మి, పీఏసీ ఎస్‌ అధ్యక్షుడు పాలడుగు సత్యనారాయణ, ఆయన అనుచరులు, మాజీ సర్పంచ్‌లు మొవ్వ జ్ఞానశేఖర్‌, పల్లపోతు శ్రీనివాసరావు తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆపార్టీకి గట్టిదెబ్బ తగిలింది. వైసీపీ గ్రామపార్టీ అధ ్యక్షుడు దాకారపు అజయ్‌బాబు మరో 50 కుటుంబాలకు చెందిన వారు ఆ పార్టీకి గుడ్‌బై పలికి పాలడుగు సత్యనా రాయణ, కూటమి అభ్యర్థి బాలశౌరి సమక్షంలో జనసేనపార్టీలో చేరడంతో ఆ పార్టీకి భారీ షాక్‌ తగిలినట్టయ్యింది. మరికొందరు వైసీపీని వీడేం దుకు సిద్దంగా ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికి ముదునూరులో వైసీపీకి షాక్‌లపై షాక్‌లు తగులుతున్న పరిస్థితులు ఆ పార్టీ నాయకులను ఆందోళకు గురి చేస్తున్నాయి.

Updated Date - Apr 29 , 2024 | 12:30 AM