Share News

లిఫ్ట్‌ మెకానిక్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:44 AM

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కృష్ణలంకకు చెందిన కాటూరి నరేంద్ర(36) అనే లిఫ్ట్‌ మెకానిక్‌ శనివారం రాత్రి ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

లిఫ్ట్‌ మెకానిక్‌ ఆత్మహత్య

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 28: ఆర్థిక ఇబ్బందులు తాళలేక కృష్ణలంకకు చెందిన కాటూరి నరేంద్ర(36) అనే లిఫ్ట్‌ మెకానిక్‌ శనివారం రాత్రి ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కాటూరి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆది వారం కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణలంక కాటూరి వారి వీధిలో కాటూరి నరేంద్ర భార్య ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. నరేంద్ర కొంతకాలం నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. శనివారం ఉదయం భార్య గంగమ్మ డ్యూటీ నిమిత్తం తాను పనిచేసే ఆస్పత్రికి వెళ్లింది. సాయంత్రం పిల్లలు ట్యూషన్‌కు వెళ్లారు. ట్యూషన్‌ నుంచి వారు ఇంటికి వచ్చి చూడగా నరేంద్ర ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహాన్ని పోలీసులు కిందకు దించి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - Apr 29 , 2024 | 12:44 AM