Share News

జగన్‌ బస్సుయాత్ర-ప్రయాణికుల పాట్లు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:58 AM

గన్నవరం నియోజకవర్గంలో సోమవారం జగన్‌ రోడ్‌ షో సందర్భంగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్‌ నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు, ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఉదయం 9గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ఏలూరు నుంచి విజయ వాడ వైపు వచ్చే లారీలు, ఇతర భారీ వాహనా లను పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద జాతీయ రహ దారి పక్కనున్న సర్వీస్‌ రోడ్డులోకి మళ్లించారు.

జగన్‌ బస్సుయాత్ర-ప్రయాణికుల పాట్లు
పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద నాలుగు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

ట్రాఫిక్‌ ఆంక్షలతో అవస్థలు

పోలీసులతీరుపై జనం ఆగ్రహం

ఉంగుటూరు, ఏప్రిల్‌ 15 : గన్నవరం నియోజకవర్గంలో సోమవారం జగన్‌ రోడ్‌ షో సందర్భంగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్‌ నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు, ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఉదయం 9గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ఏలూరు నుంచి విజయ వాడ వైపు వచ్చే లారీలు, ఇతర భారీ వాహనా లను పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద జాతీయ రహ దారి పక్కనున్న సర్వీస్‌ రోడ్డులోకి మళ్లించారు. ఇరుకుగా వుండే ఈ మార్గంలో ముందువెళ్లే వాహనాన్ని వెనుకవచ్చే వాహనం ఒకదానికొకటి ఓవర్‌టేక్‌ చేయడంతో గంటన్నరసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో బైక్‌లు, ఆటోలను ఫుట్‌పా త్‌లపై ఎక్కించి గమ్యానికి వెళ్లేందుకు వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఉక్కపోతతో విలవిల

సోమవారం ఉదయం 11 గంటలకు గన్నవరం చేరుకున్న జగన్‌ బస్సు యాత్ర చినఅవుటపల్లి, పెదఅవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, మీదుగా తేలప్రోలుకు 12గంటలకు చేరింది. బస్సు పొట్టిపాడు టోల్‌గేట్‌ దాటిన వెంటనే పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి గన్నవరం నుంచి హను మాన్‌ జంక్షన్‌వైపు వెళ్లే వాహనాలను నిలిపి వేశారు. దీంతో పొట్టిపాడు టోల్‌ ప్లాజానుంచి అవుటపల్లి వరకు సుమారు 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆటోల్లో, కారుల్లో వున్న మహిళలు, వృద్ధులు మండే ఎండ వేడిమిని తట్టుకోలేక ఉక్కపోతతో విలవిలలాడారు. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా వాహనా లను అనుమతించకపోవడంతో అసహనానికి గురైన ప్రయాణికులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేయడంతో టోల్‌గేట్‌ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతా వరణం నెలకొంది. ఎండ వేడిమికి ఏ ఒక్కరి ప్రాణం పోయినా దానికి పోలీసులు బాధ్యత వహించాల్సి వుంటుందంటూ అడ్డుగా పెట్టిన బారికేడ్లను పక్కకు లాగిపడేశారు. పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నించినా ప్రజలు ఆగకపోవడంతో చేసేదేమీలేక పోలీసులు పక్కకు తప్పుకుని వాహనాలు వెళ్లేందుకు అనుమతిచ్చారు.

స్వాగతం పలకడానికి.. కూలీ జనం

హనుమాన్‌జంక్షన్‌ : సీఎం జగన్‌ సోమ వారం నిర్వహించిన మేమంతా సిద్ధం యాత్రకు జనాన్ని తరలించడానికి బాపులపాడు మండలంలోని వైసీపీ నాయకత్వం తీవ్ర ప్రయాస పడింది. రెండు రోజులు ముందు నుంచే గ్రామాల్లో మహిళలను పెద్దఎత్తున తరలించ డానికి ప్రయత్నం చేశారు. రహదారి పొడుగునా గ్రామాల్లో జగన్‌కు స్వాగతం పలకడానికి ఒక్కొ క్కరికి రూ.300లు బిర్యాని పొట్లాం ఇచ్చి రప్పించారు. గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు వద్ద నిర్వహించిన బహిరంగ సభకు కూడా ఇదే తరహాలో మండలం నుంచి ప్రజలను తరలించారు.

Updated Date - Apr 16 , 2024 | 12:58 AM