Share News

Gudivada: టీడీపీలోకి భారీగా చేరికలు.. ఖాళీ అవుతున్న గుడివాడ రూరల్ వైసీపీ..

ABN , Publish Date - Apr 21 , 2024 | 12:25 PM

కృష్ణా జిల్లా: గుడివాడ రూరల్ వైసీపీకి గట్టి షాక్ తగిలింది. బిల్లపాడు గ్రామానికి చెందిన 100 మంది వైసీపీ కార్యకర్తలు.. వెనిగండ్ల రాము సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఈ క్రమంలో గుడివాడ రూరల్ వైసీపీ ఖాళీ అవుతోంది.

Gudivada: టీడీపీలోకి భారీగా చేరికలు..  ఖాళీ అవుతున్న గుడివాడ రూరల్ వైసీపీ..

కృష్ణా జిల్లా: గుడివాడ రూరల్ వైసీపీ (YCP)కి గట్టి షాక్ (Shock) తగిలింది. బిల్లపాడు గ్రామానికి చెందిన 100 మంది వైసీపీ కార్యకర్తలు (YCP Activists).. వెనిగండ్ల రాము (Venigandla Ramu) సమక్షంలో తెలుగుదేశంలో (TDP) చేరారు. ఈ క్రమంలో గుడివాడ రూరల్ వైసీపీ ఖాళీ అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు స్థానిక నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ సందర్బంగా బిల్లపాడు గ్రామ మహిళలు మాట్లాడుతూ.. మా ఊరు బాగుపడాలని రాముకు మద్దతుగా నిలుస్తున్నామని, ప్రభుత్వం లేదు ఏమి చేయలేకపోతున్న అంటే గతంలో నమ్మి కొడాలి నానికి ఓట్లు వేసి గెలిపించామని అన్నారు. ప్రభుత్వం వచ్చి.. మంత్రి అయిన తర్వాత కూడా కొడాలి నానీ ఏమీ చేయలేదని, కనీసం మా సమస్య వినేందుకు కూడా ఆయనకు తీరిక లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. తమ కష్టాలు పట్టించుకోని వ్యక్తికి మేమెందుకు ఓట్లు వెయ్యాలని ప్రశ్నించారు. మా ఊరు ప్రచారానికి వచ్చినప్పుడు అంతా నిలదీస్తామని మహిళలు సష్టం చేశారు.


వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. త్రాగునీటి సమస్య ఒకటి చాలు.. మాజీ ఎమ్మెల్యే కాబోతున్న వ్యక్తి రాజకీయంగా కనబడకుండా పోవడానికి అంటూ కొడాలి నానిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి బాధ్యతగా చేయాల్సిన పనులను కూడా పట్టించుకోలేదంటే ఎమ్మెల్యే అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. మన భవిష్యత్తు మన చేతిల్లోనే ఉందని, దుర్మార్గుడికి గుణపాఠం చెబితే ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు. గుడివాడ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కరించడమే తన తక్షణ కర్తవ్యమని, కొసరు కొసరు పనులు చేస్తూ ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే వైసీపీ స్ట్రాటజీ అని వెనిగండ్ల రాము వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీ భద్రత నడుమ కరీంనగర్‌కు రాధా కిషన్ రావు

రంగారెడ్డి జిల్లా: నడుస్తున్న కారులో మంటలు..

వెంకటగిరి టిక్కెట్టు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం

రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?

పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!

Updated Date - Apr 21 , 2024 | 12:39 PM