Share News

ఆటుపోట్ల మధ్య జగనన్న మెగా కాలనీ!

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:30 AM

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో 365 ఎకరాల జగనన్న మెగా ఇళ్ల కాలనీకి సముద్రపు నీరు పోటెత్తుతోంది. జగన్‌ అధికారంలోకి వచ్చాక 2020 డిసెంబరు 25న ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తొలి మెగా కాలనీ ఇదే. ఇక్కడ కాకినాడ అర్బన్‌కు చెందిన 13500వేల మందికి సీఎం జగన్‌ స్వయంగా ఇళ్ల పట్టాలు

ఆటుపోట్ల మధ్య జగనన్న మెగా కాలనీ!

కొమరగిరి కాలనీని చుట్టుముట్టిన సముద్రపు నీరు

నాడు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సీఎం జగన్‌

కొత్తపల్లి, ఏప్రిల్‌ 15: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో 365 ఎకరాల జగనన్న మెగా ఇళ్ల కాలనీకి సముద్రపు నీరు పోటెత్తుతోంది. జగన్‌ అధికారంలోకి వచ్చాక 2020 డిసెంబరు 25న ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తొలి మెగా కాలనీ ఇదే. ఇక్కడ కాకినాడ అర్బన్‌కు చెందిన 13500వేల మందికి సీఎం జగన్‌ స్వయంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే ఇప్పటికి పూర్తయిన ఇళ్లు కేవలం 180 మాత్రమే!. 5 వేల ఇళ్లు పునాదుల దశలో, 800 ఇళ్లు లింటల్‌ దశలో, 4వేల ఇళ్లు పునాదుల దశలోనే ఉన్నాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులెవ్వరూ ముందుకు రాలేదు. కాగా, కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్డులో సముద్రం నుంచి ఈ కాలనీకి అర కిలోమీటరు లోపే ఉంటుంది.


ఈ కాలనీ నుంచి ఉప్పాడ-కాకినాడ బీచ్‌రోడ్డును పరిశీలిస్తే సముద్రమే ఎత్తుగా కనిపిస్తుంటుంది. ఇటీవల సముద్రంలో ఏర్పడిన పోటుకు ఉప్పు నీరంతా ఈ కాలనీ అంచుల వరకు వెళ్లింది. ఆ నీరు వెనక్కి వెళ్లే దారిలేకపోవడంతో చెరువులా దర్శనమిస్తోంది. ఇలా సముద్రంలో ప్రతిరోజూ వచ్చే పోటు, పాట్లకు నీరు ముంచెత్తితే.. ఇక ఇక్కడ ఎలా నివసించాలో అని గృహనిర్మాణదారులు సతమతమవుతున్నారు. ఏటా నవంబరు, డిసెంబరులో ఏర్పడే తుఫాన్‌ల ధాటికి ఏకంగా కాలనీని ముంచేసినా ఆశ్చర్యం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎటూ చాలకపోవడంతోపాటు.. సముద్రపు పోటు భయం కారణంగానే ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

MLC Kavitha: కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే పైచేయి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 11:03 AM