Share News

IPS ABV Issue: ఏబీవీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు ఎప్పుడంటే?

ABN , Publish Date - Apr 16 , 2024 | 04:51 PM

తనపై రెండోసారి విధించిన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ.. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ‘సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్’ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేసు ఫైల్‌ని బెంచ్ పరిశీలించింది.

IPS ABV Issue: ఏబీవీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు ఎప్పుడంటే?

తనపై రెండోసారి విధించిన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ.. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ‘సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్’ (CAT)ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేసు ఫైల్‌ని బెంచ్ పరిశీలించింది. అది పరిశీలించాక.. సాక్షులను ఏబీవీ బెదిరించినట్లుగా చూపించే మెటీరియల్ ఎక్కడుందని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఇందుకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దయచేసి ఆర్సీబీని అమ్మిపారేయండి.. టెన్నిస్ దిగ్గజం తీవ్ర అసహనం


అంతకుముందు.. మంగళవారం ఉదయం ప్రభుత్వం దాఖలు చేసిన వ్రాతపూర్వక వాదనల్లో వాస్తవిక తప్పులు ఉన్నాయని సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు (Adi Narayanara Rao) వాదించారు. అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం.. అధికారుల కమిటీ సస్పెన్షన్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనే చట్టపరమైన వైఖరిని కూడా వివరించారు. ఏబీవీపై విధించిన సస్పెన్షన్ చెల్లదని, ఇది ఇకపై కొనసాగదని నొక్కి చెప్పారు. సుప్రీంకోర్టు ద్వారా ఏబీవీ తిరిగి నియమించబడిన తర్వాత కూడా.. అవే ఆరోపణలతో రెండోసారి సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇలా ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత.. తీర్పు కోసం విచారణను ఈనెల 23కి వాయిదా వేశారు.

ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!

ఇదిలావుండగా.. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ఏబీవీపై వైసీపీ (YCP) కక్ష సాధింపులకు పాల్పడుతోంది. 2019 ఎన్నికల సమయంలో ఆయనపై పదే పదే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసి.. ఆ పదవి నుంచి తప్పించేలా చేసింది. ఇక వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చాక.. ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు కొనుగోలు చేసి, తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసి ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం కేంద్ర హోంశాఖ దాకా వెళ్లినా.. జగన్ ప్రభుత్వం ఎటువంటి సమాదానం ఇవ్వలేదు. మరి, ట్రిబ్యునల్ తీర్పుతోనైనా ఈ వ్యవహారం కొలిక్కి చేరుతుందో లేదో చూడాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 04:51 PM