Share News

AP Elections పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ.. టీడీపీ అభ్యర్థులపై భారీ కుట్ర

ABN , Publish Date - Apr 20 , 2024 | 09:52 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ(YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆ పార్టీ నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పలు కుట్రలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో మరోసారి వైసీపీ మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సభ వేదిక కూల్చేందుకు వైసీపీ కుట్రకు తెరదీసింది.

AP Elections పల్నాడు  జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ.. టీడీపీ అభ్యర్థులపై భారీ కుట్ర

పల్నాడు జిల్లా: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ(YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆ పార్టీ నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పలు కుట్రలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో మరోసారి వైసీపీ మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సభ వేదిక కూల్చేందుకు వైసీపీ కుట్రకు తెరదీసింది.

AP Elections: మంత్రి కాకాణి ఇలాకాలో భారీగా మద్యం డంప్... అధికారులు వెళ్లి చూడగా..!


రెంటపాళ్లలో ప్రచారంలో పార్లమెంట్ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయులు, టీడీపీ అసెంబ్లీ ఆభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మీటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగాస్టేజ్ కుంగింది. కన్నా లక్ష్మీ నారాయణ, లావు శ్రీకృష్ణ దేవరాయులకు పెను ప్రమాదం తప్పింది. స్టేజీకు అమర్చిన బోల్టులను అగంతకులు తీసేశారు. స్టేజీ క్రింద బోల్టులు తొలగించడానికి వాడిన రెంచీలు లభ్యమయ్యాయి. స్టేజి క్రింద సపోర్ట్ పెట్టిన రాళ్లను సైతం అగంతకులు తొలగించారు. కుట్ర జరిగిందని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి.. స్టేజీ కుంగ్గిన విషయంపై విచారణ జరిపించాలని ఎన్నికల సంఘానికి టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.


ఇవి కూడ చదవండి

Lokesh: జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!

Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 10:06 PM