Share News

AP Elections: జగన్‌పై దాడి చేసింది వాళ్లే.. ఆనం వీడియో వైరల్..

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:06 PM

ఏపీ సీఎం జగన్‌పై రాయితో దాడి జరగడంపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. రాయి విసిరిన వ్యక్తిని పోలీసులు గుర్తించారనే ప్రచారం జరగుుతున్నా.. అధికారికంగా పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. నిందితులను గుర్తించేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జగన్‌పై దాడి చేసిన వారి ఆచూకీ తెలియజేస్తే రూ.2లక్షలు పారితోషికం ఇస్తామంటూ విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ చేసిన ప్రకటనపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు.

AP Elections: జగన్‌పై దాడి చేసింది వాళ్లే.. ఆనం వీడియో వైరల్..
Anam venkata ramana reddy

ఏపీ సీఎం జగన్‌పై రాయితో దాడి జరగడంపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. రాయి విసిరిన వ్యక్తిని పోలీసులు గుర్తించారనే ప్రచారం జరగుుతున్నా.. అధికారికంగా పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. నిందితులను గుర్తించేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జగన్‌పై దాడి చేసిన వారి ఆచూకీ తెలియజేస్తే రూ.2లక్షలు పారితోషికం ఇస్తామంటూ విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ చేసిన ప్రకటనపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. దీనికి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్‌పై దాడి చేసింందెవరో ఎవరికి తెలియదని, తనకు మాత్రమే తెలుసన్నారు. తనకు పేర్లతో సహా తెలుసని.. అయితే 2లక్షల రూపాయిల పారితోషికం తనకు అవసరం లేదన్నారు. మరోవైపు ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు జగన్‌కు ఎటువంటి గాయం కాకూడదని, తనపై ఎలాంటి దాడులు జరగకూడదని భగవంతుడిని ప్రార్థించారు.

YSRCP: సీఎం వైఎస్ జగన్‌తో నిందితుడు ఉన్నా సీబీఐ పట్టించుకోదేం..?


దాడి చేసింది ఎవరంటే..

జగన్‌పై దాడి చేసింది ముమ్మాటికి ఆత్మలేనని చెప్పారు. జగన్‌ అరాచకాలకు బలైన వ్యక్తులే ఆత్మలుగా వచ్చి దాడికి పాల్పడ్డారని చెప్పారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి, వైఎస్.వివేకానంద రెడ్డి, అమర్‌నాధ్ ఆత్మలే జగన్‌పై దాడి చేశాయన్నారు. ఇప్పటికైనా ఎలాంటి దాడులు జరగకుండా.. ఆత్మలు మరోసారి దాడికి పాల్పడకుండా.. జగన్ యాత్రలో ఏర్పాట్లు చేయాలని, ఆరుగురు పూజారులు, ఇద్దరు ఇమామ్‌లు, ఇద్దరు పాస్టర్లను నియమించుకు, బస్సు కూడా పూజలు చేసుకుంటూ వెళ్లాలని, వాక్యాలు చెప్పుకుంటూ వెళ్లాలని సూచించారు. ప్రత్యేక ప్రార్థనలు చేయడం ద్వారా ఆత్మల దాడి నుంచి జగన్‌ను కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు.


జగన్‌పై ఎలాంటి దాడి జరిగినా తెలుగుదేశం పార్టీని నిందించే అవకాశం ఉంటుందని, అందుకే ఆయనపై ఎలాంటి దాడి జరగకూడదని, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆత్మలూ మీకు మేము ఎలాంటి నష్టం చేయలేదని, దయచేసి మే13 వరకు ఏమి చేయకుండా జగన్‌ను వదిలేయాలని ఆనం ఆత్మలను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆత్మల పేర్లు తాను చెప్పగలనని, కాని చూపించలేనందువల్ల పారితోషికం తనకు వద్దన్నారు. ఆనం వెంకటరమణారెడ్డికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


CM Jagan: భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 02:06 PM