Kodali Nani: ఏందయ్యా నానీ.. ఏంటీ వింత లీలలు!
ABN , Publish Date - May 11 , 2024 | 09:11 AM
గతంలో ఎవరిని పడితే వారిని బూతులతో విమర్శించి.. నేడు అత్యంత సౌమ్యుడిలా భక్తులకు వరాలిచ్చే బాబాలా మారిపోయారు. ఆయన అడుగేస్తే పాలాభిషేకాలు, పాదాభివందనాలు, పూల రహదారులే..!
గతంలో ఎవరిని పడితే వారిని బూతులతో విమర్శించి.. నేడు అత్యంత సౌమ్యుడిలా భక్తులకు వరాలిచ్చే బాబాలా మారిపోయారు. ఆయన అడుగేస్తే పాలాభిషేకాలు, పాదాభివందనాలు, పూల రహదారులే..!
కొడాలి నాని (Kodali Nani).. ఈ పేరు వింటే బూతులే గుర్తొస్తాయి.! దాదాపు 20 ఏళ్ల నుంచి శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న నానీ గుడివాడ (Gudivada) నియోజకవర్గంలోని గ్రామాల్లో ఒక్క రోడ్డు వేసింది లేదు. గతుకుల, గుంతల రోడ్లతో నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం తనదైన ఫీట్లతో ప్రజలను ఆశ్ఛర్యచికితులను చేస్తున్నారు.
మొన్న మహిళా కార్యకర్తతో పాదాలకు పాలాభిషేకం చేయించకున్న నానీ ఇటీవల నామినేషన్‌కు వెళ్లి వస్తూ యువకుడితో పాదాభివందనం చేయించుకున్నాడు. నేడు ఏకంగా మండలంలోని బొమ్ములూరు గ్రామంలో తన కార్యకర్తలతో పూల రహదారి ఏర్పాటు చేయించుకుని నడిచి బాబా అవతారమెత్తారు. ఒక్కో సమయంలో ఒక్కో అవతారం ఎత్తుతూ బాబాలనే మించిన అవతార్ బాబాగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి విచిత్రాలు కేవలం నానికే మాత్రమే సాధ్యమయ్యాయి.