Share News

మామా అల్లుళ్ల సవాల్‌!

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:07 AM

కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగానూ, రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నుంచి ప్రధాన అభ్యర్థులు పోరు ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ కింగ్‌మేకర్లుగా ఉన్న వరసకు మామా అల్లుళ్లు పెండ్యాల అచ్చిబాబు, రాజీవ్‌కృష్ణ మధ్యే పోటీ అన్నట్టు కనిపిస్తోంది.

మామా అల్లుళ్ల సవాల్‌!
పెండ్యాల అచ్చిబాబు.. (ఇన్‌సెట్లో) కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు రాజీవ్‌కృష్ణ సెన్నార్‌ .. (ఇన్‌సెట్లో) వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు

కొవ్వూరులో ప్రధాన అభ్యర్థులు ముప్పిడి, తలారి..

కానీ అచ్చిబాబు, రాజీవ్‌ కృష్ణ మధ్యే అసలు పోరు

వైసీపీలో వర్గపోరుతో పరిస్థితి అంతా అస్తవ్యస్తం

అందుకే వనిత మార్పు.. అయినా ఆ పార్టీది ఎదురీతే

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగానూ, రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నుంచి ప్రధాన అభ్యర్థులు పోరు ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ కింగ్‌మేకర్లుగా ఉన్న వరసకు మామా అల్లుళ్లు పెండ్యాల అచ్చిబాబు, రాజీవ్‌కృష్ణ మధ్యే పోటీ అన్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఇక్కడ పోటీ ఎప్పుడూ రసవత్తరమే. 1952లో ఏర్పడిన నియోజకవర్గం ఇది. అప్పట్లో జనరల్‌ స్థానంగా ఉండేది. తర్వాత నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఇది ఎస్సీ రిజ ర్వుడు స్థానమైంది. 2009 నుంచి ఇది ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పారిశ్రామికవేత్తలైన పెం డ్యాల వెంకట కృష్ణబాబు కుటుంబమే ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తుండేది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు సహా కొన్ని నియోజకవర్గాల్లో కృష్ణబాబు, ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌, మాజీ కేంద్రమంత్రి బోళ్ల బులిరామయ్య ప్రభావం ఉండేది. వీరిదంతా ఒకే కుటుం బం. బంధువర్గం. తెలుగుదేశం ఏర్పడిన తర్వాత 1983 నుంచి 2019 వరకూ జరిగిన 9 ఎన్నికల్లో ఏడుసార్లు తెలుగుదేశం పార్టీనే గెలిచింది. 1983, 85,89, 94, 2004లో ఎమ్మెల్యేగా పెండ్యాల కృష్ణబాబు గెలిచారు. 1999లో ఒక్కసారే ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీఎస్‌ రావు గెలిచారు. 2009లో ఎస్సీ నియోజకవర్గంగా ఎన్నికలు జరగడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కృష్ణబా బు సహకారంతో టీవీ రామారావు గెలిచారు. 2014 ఎన్నికలు వచ్చేసరికి కృష్ణబాబు వైసీపీకి సపోర్టు చేశారు. దాంతో ఆయన సోదరుడు పెండ్యాల అచ్చిబాబు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడం మొదలుపెట్టారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కేఎస్‌ జవహర్‌ గెలిచారు. మంత్రి అయ్యారు. 2019లో అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఇతర ప్రాంతం నుంచి వచ్చిన టీడీపీ మహిళా నేత వంగలపూడి వనిత ఇక్కడ బరిలో నిలి చారు. వైసీపీ గాలివీయడంతో ఆ ఎన్నికల్లో ఆమె సుమారు 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. ఇక్కడ కింగ్‌మేకర్లుగా ఉన్న కృష్ణబాబు, అచ్చిబాబు, రాజీవ్‌కృష్ణలే ప్రధాన పార్టీల అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉంటారు. అయితే ఈ నియో జకవర్గంలో ప్రతీ ఎన్నికల్లోనూ అభ్యర్థులు మారిపోతూ ఉంటారు. దీనికి గెలి చిన ఎమ్మెల్యేకు, స్థానిక నేతల మధ్య వివిధ కారణాల రీత్యా అగాధం ఏర్ప డడం షరా మామూలే అయింది. ఇక 2014 ఎన్నికల తర్వాత కృష్ణబాబు రాజ కీయ జోక్యం తగ్గించారు. ఆయన ఆరోగ్య, ఇతర కారణాల రీత్యా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన స్థానంలో వైసీ పీని నడిపించే బాధ్యత రాజీవ్‌కృష్ణ చేతికి వచ్చింది. 2014లో రాజీవ్‌కృష్ణ నిడ దవోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లో టీడీపీ హవా అధికంగా ఉండడం వల్ల టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయన కొవ్వూరుకే పరిమితమై ఇక్కడ అభ్యర్థిని గెలిపించడం కోసం పనిచేస్తున్నారు. 2019లో తానేటి వనిత విజయం వెనుక రాజీవ్‌ సహకారం ఉంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి బాధ్యత అచ్చిబాబు తీసుకున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటే శ్వరరావు. వైసీపీ అభ్యర్థిగా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పోటీ చేస్తున్నారు. వీరు గోపాలపురంలో ఒకరిపై ఒకరు 2014, 2019లో పోటీపడి, 2014లో ముప్పిడి, 2019లో తలారి గెలిచారు. ఇద్దరూ ఈ ఎన్నికల్లో కొవ్వూరు లో మూడోసారి తలపడుతున్నారు. వాస్తవానికి ఈ పోటీ ఈ ఇద్దరి మధ్య కాకుండా అచ్చిబాబు, రాజీవ్‌కృష్ణ మధ్య పోటీగా మారింది. అచ్చిబాబు అన్న కృష్ణబాబు అల్లుడే రాజీవ్‌కృష్ణ. అంటే అచ్చిబాబుకు అల్లుడు వరస రాజీవ్‌ కృష్ణ సెన్నార్‌ ఈ నేపథ్యంలో ఇక్కడ కొవ్వూరు ఎన్నిక మామా అల్లుళ్ల సవా ల్‌గా మారింది. 2019 ఎన్నికల్లో అల్లుడిదే పైచేయి అయింది. ఈసారి మామ అచ్చిబాబు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈసారి వైసీపీకి ఎదురీతే..

వాస్తవానికి టీడీపీకి ఈ నియోజకవర్గం కంచుకోట. 2019 ఎన్నికలకు వచ్చే నెల 13న జరగబోయే ఎన్నికలకు తేడా ఉంది. ఇవాళ అధికారి వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అంతేకాక ఇక్కడ గెలిచి హోంమంత్రి అయిన తానేటి వనిత ఇక్కడ దళిత వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా ముఖ్యవర్గానికి వ్యతిరేకంగా గ్రామాల్లో చిచ్చుపెట్టారనే విషయం తీవ్ర నష్టాన్ని తెచ్చింది. ఒక వర్గానికి చెందిన ఇద్దరు ముగ్గురు మాటలు విని ప్రధాన వర్గా న్ని దూరం చేసుకున్నారనే వాదన కూడా ఉంది. అంతేకాక ఆమెను అభ్యర్థిగా తెచ్చుకుని గెలిపించిన రాజీవ్‌కృష్ణకు కూడా వ్యతిరేకంగా వ్యవహరించడం ఇక్కడ వైసీపీకి సమస్యగా మారింది. అందుకే ఆమెను గోపాలపురం నియోజ కవర్గానికి పంపించి అక్కడి ఎమ్మెల్యే తలారి వెంకట్రావును ఇక్కడ పోటీపె ట్టారు. వనితను పక్క నియోజకవర్గానికి మార్చినప్పటికీ ఇక్కడ వర్గపోరు మాత్రం సర్దుమణగలేదు. అంతేకాక కొందరి మాటలు విని రాజీవ్‌కృష్ణను వేరే ప్రాంతానికి పరిశీలకుడిగా పంపించే ప్రయత్నం జరగడం, దాంతో ఆయన కొద్దిరోజులు సైలెంట్‌ అయ్యారు. తిరిగి వైసీపీ అధిష్ఠానం జరిగిన తప్పు తెలుసుకుని మళ్లీ ఆయనకు ఇక్కడ బాధ్యతలు అప్పగించింది. దాంతో ఆయన పార్టీ అభ్యర్థికి సంబంధించి ఎన్నికల సారథ్య బాధ్యతలను చేపట్టారు. కానీ ఇప్పటికే వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆ పార్టీ వర్గాలే చెబు తున్నాయి. ఎంపీపీతోపాటు పలువురు నేతలు వైసీపీని వదిలి టీడీపీలో చేరారు. వైసీపీ అభ్యర్థి తలారి వెంక ట్రావు ఎన్నికల ప్రచారం సందర్భంగానూ పార్టీలో వర్గపోరు తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. జగన్‌ బస్సుయాత్ర, తలారి వెంకట్రావు నామినేషన్‌ దాఖలకు అవసరమైన ఏర్పాట్లకోసం చర్చించడానికి ఆదివారం సమావేశమైన సందర్భంలో వేదిక మీదకు ముఖ్యులను ఆహ్వానించే సమయంలో ఒకరు అడ్డుతగలడంతో కొట్టుకునే పరిస్థితి దాపురించింది. ఇలా పార్టీలో నెలకొన్న అనేక తలనొప్పులను సరిదిద్ది, ఎన్నికల ప్రణాళికను ముందుకు నడిపించే విషయంలో రాజీవ్‌కృష్ణ ఎంతవరకూ నెట్టుకొస్తారో చూడాలి. ఇక 2009లో టీడీపీ, కాంగ్రెస్‌, ప్రజారాజ్యం మధ్య త్రిముఖ పోటీ జరిగినప్పుడు కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటిగా పోటీ చేస్తున్నాయి. పైగా ఎన్నడూ లేని విధంగా అచ్చిబాబు స్వయంగా గ్రామాల్లోకి కూడా వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈనేపథ్యంలో మే 13న ముప్పిడి వెంకటేశ్వరరావు, తలారి వెంకట్రావు మధ్య జరిగే ఎన్నిక అచ్చిబాబు, రాజీవ్‌కృష్ణ మధ్య మామా అల్లుళ్ల సవాల్‌గా మారింది.

Updated Date - Apr 16 , 2024 | 02:07 AM