Share News

డిగ్రీలు పట్టుకుని.. పొట్టచేతపట్టుకుని..!

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:14 AM

‘డిగ్రీలు పుచ్చుకొని.. పొట్ట చేతపట్టుకుని’ ఈ మాటలు ఎక్కడో విన్నట్టు ఉన్నాయి కదూ.. ఆకలిరాజ్యం సినిమాలోని సూపర్‌హిట్‌ పాటలో ఒక లైన్‌ ఇది.. ఈ ఐదేళ్లు జగన్‌ ప్రభు త్వం ఈ మాటను నిజం చేసింది.. యువతకు ఉద్యోగాల్లేవ్‌.. చిన్నా చితక ఉద్యోగాలు తప్ప చదువుకు తగిన ఉద్యోగాల ఊసేలేదు..

డిగ్రీలు పట్టుకుని.. పొట్టచేతపట్టుకుని..!

ఐదేళ్లూ జగన్‌ ఆటలు

జాబ్‌ క్యాలెండర్‌పై మాట తప్పారు

విడుదలకాని నోటిఫికేషన్లు

ఐదేళ్లూ సర్కారీ కొలువుల్లేవ్‌

మెగా డీఎస్సీ పేరుతో వంచన

పరిశ్రమలు పడక..75 శాతం ఉద్యోగాల్లేవ్‌

వలంటీర్‌ ‘సేవ’ను ఉద్యోగాలుగా బడాయి

ఇంజనీరింగ్‌ చదివి ఇంట్లోనే కాలక్షేపం

20 లక్షల ఉద్యోగాలంటూ కూటమి వరం

‘డిగ్రీలు పుచ్చుకొని.. పొట్ట చేతపట్టుకుని’ ఈ మాటలు ఎక్కడో విన్నట్టు ఉన్నాయి కదూ.. ఆకలిరాజ్యం సినిమాలోని సూపర్‌హిట్‌ పాటలో ఒక లైన్‌ ఇది.. ఈ ఐదేళ్లు జగన్‌ ప్రభు త్వం ఈ మాటను నిజం చేసింది.. యువతకు ఉద్యోగాల్లేవ్‌.. చిన్నా చితక ఉద్యోగాలు తప్ప చదువుకు తగిన ఉద్యోగాల ఊసేలేదు.. జగన్‌ ప్రభుత్వంలో యువత దగా పడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌ అంటూ గత ఎన్నికల సందర్భంగా జగన్‌ డాబు కబుర్లు చెప్పారు. వాటిని నమ్మిన యువత నోటిఫికేషన్లకు ఎదురు చూపులతోనే ఐదేళ్లు ఆవిరైపోయాయి. వారి వయసుకు ఐదేళ్లు జమయిపోయింది.

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వంలో యువత ఆశలు నీరుగారిపోగా.. నిరుద్యోగం కోరలు చాచింది. డిగ్రీలు చదివి ఇంట్లో ఉండిపోయిన పిల్లలను చూస్తూ తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. జగన్‌ సీఎం పీఠమెక్కిన తర్వాత సర్కారీ కొలువులకు ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. వలంటీర్ల ‘సేవ’ను ఉద్యోగాల జాబితాలో కలిపేసుకుని లక్షల ఉద్యోగాలు ఇచ్చా మంటూ ఐదేళ్లు కాలక్షేపం చేసేశారు. జాబ్‌ మేళాలంటూ యువతను వంచన చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ‘గాలి’ ప్రకటన తెరపైకి తెచ్చి యువతను మరింత మనోవేదనలో ముంచేశారు. ఐదేళ్ల పాటు యువతను వేధించిన సీఎంగా జగన్‌ మరో ఘనత సాధించారు.కూటమి 20 లక్షల ఉద్యో గాలిస్తామని చెప్పడంతో యువతలో నూతనోత్సాహం కనిపి స్తోంది.గత చంద్రబాబు హయాంలో పెద్ద సంఖ్యలో ఉపాధి పొందిన చరిత్రను ఉద్యోగార్థులు గుర్తు చేసుకుంటున్నారు.

మెగా డీఎస్సీ .. 390 ఉద్యోగాలు..

ఐదేళ్లుగా ఎప్పుడెప్పుడా అని యువత ఎదురు చూసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎన్నికల ఎత్తులో భాగంగా పరుగు పరు గున వచ్చేసి మెగా పేరుతో భావి ఉపాధ్యాయులను దగా చేసింది. ఖాళీలు బ్లాక్‌ బోర్డంత ఉండగా భర్తీల సంఖ్య మాత్రం చాక్‌పీసంత కూడా లేదు. ఎన్నికల వేళ ఓ నోటిఫి కేషన్‌ను హడావుడిగా తెరపైకి తీసుకొచ్చి యువతను మోసం చేశారు. గత ఎన్నికల ముందు ఓట్ల కోసం మెగా డీఎస్సీ అని ఊదరగొట్టిన జగన్‌కి మళ్లీ ఎన్నికల సమయానికి గానీ ఉద్యోగార్థుల ఆవేదన వినిపించలేదు. ఉమ్మడి తూర్పుగోదా వరిని పరిగణనలోకి తీసుకొని డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 2 వేలపైనే ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయి.జగన్‌ ప్రభు త్వం మెగా డీఎస్సీ పేరుతో కేవలం 390 పోస్టులకు నోటిఫి కేషన్‌ విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్‌కి నెలముందు ప్ర భుత్వం డీఎస్సీని ప్రకటించింది. ఉపాధ్యాయ అర్హత పరీ క్షకు 20 రోజులు సమయం ఇచ్చి తర్వాత 10 రోజులకే డీఎస్సీ అన్నారు.అంత తక్కువ సమయంలో అభ్యర్థులు రెం డింటికీ ఎలా సన్నద్ధమవుతారని పాలకులు ఆలోచించలేదు. ఒక పక్క పోస్టులు తక్కు వగా ఉండడం..మరో పక్క పరీ క్షల షెడ్యూల్‌ తో ఉద్యోగార్థులను జగన్‌ టార్చర్‌ పెట్టారనడంలో సందేహం లేదు. కొందరు అభ్యర్థులు తమ ఆవే దన చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు కంటనీరు పెట్టించాయి.

జగన్‌ మార్కు మెలిక

డీఎస్సీ నోటిఫికేషన్‌లోనూ జగన్‌ మార్కు మెలిక తప్పలేదు. కీలకమైన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హు లుగా ప్రకటించి ప్రభుత్వం ఉద్దేశపూ ర్వకంగా ప్రక్రియ జాప్యం చేయా లనే పన్నాగం పన్నింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని గతంలో సుప్రీంకోర్టు చెప్పి ంది. జగన్‌ ప్రభుత్వం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వాళ్లను అర్హు లుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చేసింది. హైకోర్టు మొట్టికా యలతో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ వారిని మాత్రమే అనుమతి స్తామని తెలిపింది.దాంతో ఎస్జీటీ పోస్టుల దరఖాస్తుదారుల పరిస్థితి అయోమయంలో పడింది.

ఉన్నత చదువులు..చిన్న ఉద్యోగమా?

సచివాలయ ఉద్యోగాల పేరుతోను యువతను జగన్‌ సర్కారు మోసం చేసింది.. ప్రభుత్వ ఉద్యోగమంటూ ప్రచారం చేసింది..పెద్ద పెద్ద చదువులు చదివిని యువత తమ ఉద్యో గాలు మానివేసి సచివాలయ ఉద్యోగాల బాటపట్టారు. ఇప్పు డు ఉండలేక..వచ్చేది సరిపోక..బయటకు వెళ్లలేక సతమత మవుతున్నారు.చంద్రబాబు వస్తే తమకు మంచి దారి చూపు తారని ఎదురుచూస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థతో మరి కొంత మంది యువత ఆటలాడుకున్నారు.ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చి గ్రామాలకే కట్టిపడేశారు. వలంటీర్లు చేసేది సేవ అని జగన్‌ పలుమార్లు అన్నారు. యువత జీవితంలో ఐదేళ్లూ ఎంత విలువైనదో సీఎం సారుకు తెలియదా పాపం.. కేవలం రూ.5వేలు గౌరవభృతి మాత్రమే ఇచ్చి రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోడానికి వలంటీరు వ్యవస్థను తెరపైకి తెచ్చా రు.వారితో ‘అన్ని’ పనులూ చేయించుకున్నారు. చివరికి వారిని అడకత్తెరలో వలంటీరు మాదిరిగా చేసేశారు. ఎన్నికలు వచ్చే సరికి తీసి పక్కన పెట్టేశారు.ఇలా లక్షలాది ఉద్యోగాలు కల్పిం చామంటూ అంకెల గారడీతో నాలిక మడత పెట్టేశారు జగన్‌.

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలేవి..

జగన్‌ ప్రభుత్వం వచ్చాక మద్యం పరిశ్రమలను బలవం తంగా వైసీపీ నాయకులు చెరబట్టి వ్యాపారం చేస్తున్నారు. అవి తప్ప కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. ఐదేళ్లలో యువతకు ఉపాధి కల్పించే విధంగా ఒక్క పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించలేదు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో చాలా పరిశ్రమలు పడకేశాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే చూస్తే సుమా రు 10 పరిశ్రమల వరకూ మూతపడ్డాయి. విజ్జేశ్వరం పవర్‌ ప్లాంట్‌, వేమగిరిలో జీవీకే, బిక్కవోలు మండలం కానేడులో బ్లూక్రాఫ్ట్‌ ఆగ్రో ఇండస్ర్టీస్‌,జీడిపప్పు, సగ్గుబియ్యం పరిశ్రమలు సైతం మూతపడ్డాయి. కాకినాడ, కోనసీమ జిల్లాలో మరిన్ని పరిశ్రమలు సైతం లాకౌట్‌కు గుర య్యాయి.దీంతో సుమారు 50 వేల మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఉమ్మడి తూర్పు లో మూడు నాలుగు పరి శ్రమలకు కొబ్బరికాయలు కొట్టినా అంతకుమించి ఒక్క అడు గూ ముందుకు పడలేదు. రాజా నగరం నియోజకవర్గం పరిధిలో ఎన్నికల షెడ్యూల్‌కి ఒక్క రోజు ముందు హడా వుడిగా పారిశ్రామికవాడకు శంకుస్థాపన చేశారు.ఈ ఐదేళ్లలో గుర్తుకురాని పరిశ్రమలు, యువతకు ఉపాధి పాలన చివరలో జగన్‌కి ఠక్కున గుర్తొచ్చేశాయి.ఏడాదికి వేలాది మంది ఇంజ నీరింగ్‌, బీఎస్సీ, బీఏ, బీబీఎం, బీకాం వంటి డిగ్రీలు పూర్తి చేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక ఇంట్లో కాలక్షేపం చేయక తప్పలేదు.గత ఎన్నికల్లో భాగంగా స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అనే జగన్‌ హామీని అటకెక్కించారు. అటు ఉద్యోగాల కల్పన లేక,ఇటు పరిశ్రమలు మూతప డడంతో యువత అల్లాడిపోయారు. కొందరు సెల్‌ ఫోను షాపులు, షాపింగ్‌ మాల్స్‌, ఆటోమొబైల్‌ తదితర దుకా ణాల్లో అతి తక్కువ జీతానికి విధిలేక పనిచేస్తున్నారు.

కూటమితో ఊతం

గత ఎన్నికల్లో జగన్‌ ఇచ్చిన హామీలు ‘గాలి’ మాటలు కావడంతో పెద్ద సంఖ్యలో యువత కుదేలయ్యారు. నోటిఫి కేషన్లకు ఎదురు చూడడంతోనే ఐదేళ్లు గడచిపోయాయి. ఇక జగన్‌ మాటలు నమ్మే స్థితిలో యువత లేదు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ భరోసా ఇవ్వడంతో యువతలో మళ్లీ నూతనోత్సాహం కనిపిస్తోంది. చంద్రబాబు హయాంలో పెద్ద సంఖ్యలో వచ్చిన ఉద్యోగాలను వారు గుర్తు చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నైపుణ్య శిక్షణ పడకేసింది. నోటిఫికేషను ముఖం చాటేసింది. విదేశాల్లో ఉపాధి ఊసే మరిచిపోయారు.

చంద్రబాబు వస్తే ఐటీ వస్తోంది..!

నేడు మనం చూస్తున్న హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ చంద్రబాబు విజన్‌కి ప్రతి రూపం. వేలాది మంది ఐటీ చదివిన పిల్లల కలల సాకారానికి నిదర్శనం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా వేదికతో మొదలు పెట్టిన విధ్వంసం అమరావతి వరకూ నిరం తరాయంగా కొనసాగింది. 2019లో చంద్రబాబు సీఎం అయి ఉంటే రాష్ట్రా నికి చెందిన ఐటీ పిల్లలు వేరే రాష్ట్రాలకు కేవలం రూ.10వేల జీతానికి వలస వెళ్లా ల్సిన పరిస్థితి దాపురించేది కాదు. మనకు దగ్గర లోని అమరావతిలో ఉద్యోగం చేసుకునేవాళ్లు. విభజిత రాష్ట్రంలో జగన్‌ ఐటీ పిల్లల ఉపాధికి ఒక్క ప్రయత్నమూ చేయలేదు. ఏపీలో ఐటీ కొలువు కలగానే మిగిలిపోయింది. దీంతో బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్‌కి పిల్లలు వలస వెళ్లక తప్పడం లేదు. ఇప్పుడు మళ్లీ ఐటీ హబ్‌ అంటూ జగన్‌ ఊదరగొడుతున్నారు.చంద్రబాబును రాజమండ్రి సెం ట్రల్‌ జైలులో బంధించిన సమయంలో ఐటీ ఉద్యోగులు భా రీగా వచ్చారు.వాళ్లనూ వైసీపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా అడ్డు కొంది.మలేషియాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న ఓ ఉద్యోగి రూ.2లక్షలు ఖర్చు పెట్టుకొని చంద్రబాబును చూడాలని ఆనాడు రాజమండ్రి వచ్చారు.ఇదొక్క ఘటన చాలు చంద్ర బాబు విజన్‌ గురించి చెప్పడానికి. మళ్లీ చంద్ర బాబు వస్తే అమరావతిలో హైటెక్‌ సిటీ వస్తుందని యువత భరోసాగా ఉండడమే ఆ నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Updated Date - Apr 29 , 2024 | 01:14 AM