Share News

అండగా నేనుంటా..

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:02 AM

మైనింగ్‌ను అక్రమంగా దోచేందుకే ప్రత్తిపాడు నియోజకవర్గంపై వైసీపీ నాయకులు కన్నువేశారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నా రు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వ రంలో ఆదివారం నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. ప్రత్తిపాడు మండలంలో లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌నూ తరలించుకుపోతున్నారన్నారు.

అండగా నేనుంటా..

  • ప్రత్తిపాడు, జగ్గంపేట వారాహి యాత్రలో పవన్‌కల్యాణ్‌

  • మైనింగ్‌ మాఫియా ఆట కట్టిస్తా

  • నాకు అన్ని కులాలు సమానమే

  • సమస్యల పరిష్కారంపైనే దృష్టి

  • ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరే లక్ష్యం

ఏలేశ్వరం/ జగ్గంపేట/ జగ్గంపేట రూరల్‌/ కిర్లం పూడి, ఏప్రిల్‌ 28 : మైనింగ్‌ను అక్రమంగా దోచేందుకే ప్రత్తిపాడు నియోజకవర్గంపై వైసీపీ నాయకులు కన్నువేశారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నా రు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వ రంలో ఆదివారం నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. ప్రత్తిపాడు మండలంలో లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌నూ తరలించుకుపోతున్నారన్నారు. మాఫియా డాన్‌ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తమ్ముడు లంపకలోవలో ఉన్న వీరభద్ర కంపెనీకి అనువుగా రోడ్డు, బ్రిడ్జి నిర్మించుకున్నారుకానీ నియోజకవర్గంలో ఉన్న రోడ్లను, ప్రజల సమస్యలను నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. ఏలేరు ప్రాజెక్టు, సుబ్బారెడ్డిసాగర్‌, చంద్రబాబు సాగర్‌లను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే వంతాడ అక్రమ మైనింగ్‌ ఆపు తానన్నారు. పెద్దమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక మం డలాన్ని ఏర్పాటుచేసి గిరిజనులకు మేలు చేస్తానన్నా రు. 72 ఎయిడెడ్‌ స్కూల్స్‌, కళాశాలలను తీసేసిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలను కూటమి ప్రభుత్వంలో పునరుద్ధరిస్తామన్నా రు. కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ప్రజలకు అండగా ఉంటానన్నారు. దళితుడైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్యచేసి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుకు సీఎం ప్రాధాన్యం ఇవ్వడం పలు అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. జగన్‌ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా ఉన్న చలమలశెట్టి సునీల్‌ను ఓటర్లు నిలదీయాలన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్యారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నీడను కూడా ప్రత్తిపాడుపై పడనీయబోయనని స్పష్టంచేశారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కార్పొరేషన్‌కు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తామన్నారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ, గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ను గెలిపించాలన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షు డు జ్యోతుల నవీన్‌ మాట్లాడుతూ నిత్యపోరాటయోధుడు పవన్‌కల్యాణ్‌ నీతికి నిలబడే వ్యక్తి అన్నారు. ్ఞ్ఞఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మీసాల రాజు, గాటా బాలుదొర, బాబి తదితరులు పాల్గొన్నారు.

జగ్గంపేట అభివృద్ధికి కృషి

ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరందించడమే ముఖ్య లక్ష్యమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గ సమస్యలపై కిర్లం పూడిలో నిర్వహించిన వారాహి సభలో పవన్‌ మాట్లాడారు. ‘మల్లవరం ప్రాజెక్టుకు రూ.132 కోట్లు అంచనా వేసి రెండుసార్లు శంకుస్థాపన చేసి కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం నిర్వీర్యమైపోయిందన్నారు. పోలవరం మట్టి గట్లను తవ్వేస్తున్నా జలవనరులశాఖ చోద్యం చూస్తుందని మండిపడ్డారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి 175 ఎకరాల దుస్లాం చెరువును వైసీ పీ ప్రతినిధులు ఆక్రమించేశారని తెలిపారు. గోకవ రంలో పంచాయతీ స్థలాల్లో లాడ్జిలు నిర్మించారన్నా రు. వైసీపీ శ్రేణులు రామేశ్వరంమెట్ట మట్టి తరలించుకుపోయి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం నీరురాక 30 వేల ఎకరాలు ఎండితున్నా కనీ స స్పందన లేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక కిర్లంపూడికి డిగ్రీ కాలేజీ తెస్తాం. ఏలేరు ఆధునికీకరణ చేస్తాం. మల్లవరం సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేస్తాం’ అని స్పష్టంచేశారు. జగన్‌ గత ఎన్నికల్లో కాపుల కు రిజర్వేషన్‌ ఇవ్వలేనని చేతులెత్తేశారని, అప్పుడు జగన్‌ను అడగలేకపోయారని, ఈ డబ్ల్యూసీ పథకం కింద టీడీపీ ఐదు శాతం ఇస్తే దాన్నీ వైసీపీ తుంగలోకి తొక్కిందన్నారు. ఇక్కడ ఉద్యమ నాయకులు సినిమాల్లో రంగులేసుకునే వార ని హేళన చేస్తున్నారు తప్పితే కాపులకు మంచి చేస్తే ఆనందపడేవాడినన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని కులాలకు సమన్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కరిస్తా

కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌

జనసేన పార్టీ అంటే జెండా కాదు.. అజెండా ఉన్న పార్టీ. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనింగ్‌, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్య అధికంగా ఉంది. కాకినాడ పోర్టు అభివృద్ధి చేయరు, రైల్వే జోన్‌ పట్టించుకోరు. సెజ్‌ భూములను చిత్తశుద్ధితో పట్టించుకుని పరిశ్రమలు తీసుకొస్తే ఆరు లక్షలమందికి ఉద్యోగం కల్పించవచ్చు. సెజ్‌ భూములను రియల్‌ ఎస్టేట్‌లా వాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను నెరవేరుస్తాను.

యువత భవిష్యత్‌ కోసమే పవన్‌ ఆరాటం..

ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి వరుపుల సత్యప్రభ

రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్‌ కోసం అండగా నిలబడి కూటమి గెలుపు కోసం పవన్‌కల్యాణ్‌ ఎంతో కృషి చేస్తున్నారు. నా భర్త రాజా మరణం అనంతరం అండగా నిలిచి ధైర్యం చెప్పిన చంద్రబాబు రుణం తీర్చుకోలేనిది. కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి నాకు మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సుబ్బారెడ్డిసాగర్‌, చంద్రబాబు సాగర్‌ ఆధునికీకరణ పనులు జరగక రైతులకు నీరు అందడం లేదు. అధికారంలోకి రాగానే సమస్యల్నీ పరిష్కరిస్తాం.

త్యాగశీలి పవన్‌కల్యాణ్‌

జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ

విజన్‌ ఉన్న చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఉమ్మడిగా ఆయన్ను సీఎం చేయడానికి మూడు పార్టీల మద్దతు ఉంది. తనకున్న బలాన్ని తగ్గించుకున్న వ్యక్తి పవన్‌కల్యాణ్‌. సంక్షేమం, అభివృద్ధి అందించడం కోసం ఒక త్యాగశీలిగా నిలిచారు. పవన్‌కల్యాణ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్టులు తీసుకువచ్చి వ్యవసాయంతో పాటు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తాను. పొలాలకు సాగునీటి కొరత లేకుండా చేసి సస్యశ్యామలం చేస్తా.

Updated Date - Apr 29 , 2024 | 01:02 AM