Share News

ఎన్నికల్లో మాజీ సైనికులు సేవలు అందించాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:13 AM

జిల్లాలో మే 13న జరిగే ఎన్నికల పోలింగ్‌ విధుల్లో మాజీ సైనికులు సేవలు అందించాలని జిల్లా ఎన్నికల అధికారిణి డాక్టర్‌ కే మాధవీలత కోరా రు.

ఎన్నికల్లో మాజీ సైనికులు సేవలు అందించాలి : కలెక్టర్‌

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 15: జిల్లాలో మే 13న జరిగే ఎన్నికల పోలింగ్‌ విధుల్లో మాజీ సైనికులు సేవలు అందించాలని జిల్లా ఎన్నికల అధికారిణి డాక్టర్‌ కే మాధవీలత కోరా రు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లో మాజీ సైనికుల అసోసియేషన్‌ సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌కే మాధవీలత మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో సైనికుల సేవలు నిరుపమానం అన్నారు. పోలింగ్‌ సజావుగా సాగేందుకు మీవంతు సహకారం అందించాలన్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యే వారికి పోస్ట ల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని కలగజేస్తామన్నారు. జిల్లా ఎస్పీతో సంప్రదించి మీ సేవలు ఎక్క డ అవసరమో తెలుసుకుని, ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం మాజీ సైనికులు అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 600 మంది మాజీ సైనికులు ఉన్నారని వారంతా సహకారాన్ని అందిస్తారన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ నరసింహులు, జిల్లా మాజీ సైనికులు అసోసియేషన్‌ అధ్యక్షుడు జి ప్రసాదరావు, సెక్రటరీ జై చంద్రశేఖర్‌, కోశాధికారి, రాజేంద్రకుమార్‌, ఇతర మాజీ సైనికులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 07:47 AM