Share News

రాజమహేంద్రవరం రూపురేఖలు మారుస్తా

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:00 AM

వైసీపీ పాలకులు రాజమహేంద్రవరాన్ని గత ఐదేళ్లుగా అస్తవ్యస్తం చేశారు. కూట మి అధికారంలోకి వచ్చాక నగరవైభవాన్ని ఇనుమడింపచేస్తూ మోడల్‌ సీటీగా అభి వృద్ధి చేస్తానని టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నా రు.

రాజమహేంద్రవరం రూపురేఖలు మారుస్తా

నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తాం

ప్రతీక్షణం ప్రజలకే అంకితం

టీడీపీ-జనసేన-బీజేపీ ఆత్మీయ సమావేశంలో అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 28: వైసీపీ పాలకులు రాజమహేంద్రవరాన్ని గత ఐదేళ్లుగా అస్తవ్యస్తం చేశారు. కూట మి అధికారంలోకి వచ్చాక నగరవైభవాన్ని ఇనుమడింపచేస్తూ మోడల్‌ సీటీగా అభి వృద్ధి చేస్తానని టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నా రు. రాజమహేంద్రవరం తుమ్మలావ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాలు వద్ద ఆదివారం రాత్రి టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడు యాళ్ళ ప్రదీప్‌ ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ-బీజేపీ-జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన, జనసేన సిటీ ఇంచార్జీ అనుశ్రీ సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌లు ముఖ్యఅతిఽథులుగా హాజరయ్యారు. ఈసందర్బంగా తొలుతు అనుశ్రీ, హితేష్‌లు మాట్లాడారు. ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అందరివాడని ప్రజలకు కష్టం అంటే ముందుంటాడన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమహేంద్రవరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తారన్నారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుందన్నారు. గత ఐదేళ్లుగా ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. రాజమహేంద్రవరంలో 2019వరకు లేని బ్లేడు బ్యాచ్‌లు ఇప్పుడు ఎలా వచ్చాయని దానికి కారణం వైసీపీ కాదా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక యువకులుకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. మెగా డీఎస్సీ తీస్తారన్నారు. రాజమహేంద్రవరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. నిరుద్యోగ భృతి రూ.3000 ఇస్తారని చెప్పారు. 25శాతం కమిషన్‌ తీసుకుని నగరంలో అనాలోచిత పనులు చేయడంవల్ల నగరంలో ముంపు ప్రాంతాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తామన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేసి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఒక ప్రణాళిక కూడా రూపొందించామన్నారు. నగర ప్రజలను సురక్షితమైన తాగు నీరు సమృద్దిగా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చెత్తపై విధించిన పన్నులు, పార్కుల ప్రవేశ రుసుములు రద్దు చేయిస్తామన్నారు. ఎన్నికల్లో తనను, ఎంపీగా దగ్గుబాటి పురందేశ్వరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆదిరెడ్డి వాసును, అనుశ్రీ సత్యనారాయణ, హితేష్‌ చెంచురామ్‌లను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ తంగేళ్ళబాబి, గొర్రెల సత్యరమణి. కరగాని వేణు, యాళ్ళ వెంకట్రావు, పెద్దఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ముస్లింలకు న్యాయం చేసింది చంద్రబాబే : ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు

రాష్ట్రంలో ముస్లిం సోదరులకు న్యాయం చేసింది గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ నేత చంద్రబాబే అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మసీదుల అభివృద్ధికి షాదీఖానాలకు నిధులు కేటాయించింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. పవిత్ర రంజాన్‌మాసంలో సోదరుల కుటుంబాలకు రంజాన్‌ తోపాను అందించిందన్నారు. రాజమహేంద్రవరంలో మసీదులు, షాదీఖానాలు అభివృద్ధి తాము కృషి చేశామన్నారు. రెహ్మత్‌నగర్‌లో షాధీఖానా నిర్మాణానికి రూ.67,37, 453, నెహ్రునగర్‌ ఈద్గాకు కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.20,32,549, మెయిన్‌ రోడ్డులో ముస్లింల బరియల్‌ గ్రౌండ్‌ అభివృద్ధికి రూ.15లక్షలు, జైలువార్డర్స్‌వద్ద ఉన్న ఆయేషా షాధీఖానా అభివృద్ధి కోసం రూ.25లక్షలు, అప్సరా ఽథియేటర్‌ వెనుక ఉన్న హజరత్‌ వల్లీ జల్‌ జలీహ్‌ షాదీఖానా అభివృద్ధి కోసం రూ.25లక్షలు, దానవాయిపేట మదీనా షాదీఖానా అభివృద్ధి కోసం రూ.20లక్షలు, అదేప్రాంతంలో నూతనంగా షాదీఖానా నిర్మాణంకోసం రూ.50లక్షలు నిధులు కలిపి మొత్తం రూ.2,22,702 నిధులు మంజూరు చేయించానన్నారు. టీడీపీ హయాంలో రెహ్మత్‌ నగర్‌లో షాధీ ఖానాకు రూ.63 లక్షల మైనార్టీ వెల్ఫేర్‌ నిధులు, రూ.25 లక్షలు ఎంపీ నిధులు విడుదల చేసి కార్పొరేషన్‌ కమిషనర్‌ వారి ఖాతాకు జమచేయగా దాని నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు పిలిచామని దాని నిర్మాణ పనులు ముందకు సాగకుండా జగన్‌ ప్రభుత్వం ఆపేసిందన్నారు. ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ కూటమి అభ్యర్ధిగా పోటీచేస్తున్న తన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను, ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వైసీపీ పాలనలో అన్నివర్గాలకు కష్టాలే

టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల

కడియం/రాజమహేంద్రవరంరూరల్‌, ఏప్రిల్‌ 28: వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు అనేకకష్టాలు పడ్డారని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మె ల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఆదివారం జేగరుపాడులో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీష, సీనియర్‌ టీడీపీ నాయకులు గారపాటి అమరనాద్‌తో కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామంలో అతి సుం దరంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని గోరంట్ల ప్రారంబించారు. పలువురు పార్టీలో చేరారు. వారికి గోరంట్ల పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోరంట్ల మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకోలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. వైసీపీ ఐదేళ్లలో చేనేత కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. వారితోపాటు అనేక వృత్తులు వారు తీవ్ర ఇబ్బం దులు పడ్డారన్నారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కొత్త రహదారులు మాట ఎలాఉన్నా కనీసం రహదారులు మరమ్మతులు కూడా లేవన్నారు. మండలంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉందన్నారు. గ్రామాల్లో మురుగునీరు పోయే విధంగా ప్రణాళికలు చేసి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కూ టమి అధికారంలోకి రాగానే ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, మండలంలో మాధవరాయుడుపాలెం గ్రామంలో 15వేల ఇళ్ల నిర్మాణం చేసి ఇల్లులేని ప్రతీ పేదవానికి ఇల్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గారపాటి అమరనాద్‌, పాతూరి రాజేష్‌, నాగిరెడ్డి రామకృష్ణ, ఆకుల శ్రీధర్‌, ప్రత్తిపాటి రామారావుచౌదరి, గెడ్డం శివ, కర్రి చినబాబు, మర్రెడ్డి రమేష్‌, వల్లూరి మోహన్‌, వనమాలి బాలాజీ, కొమ్మరవత్తుల సూర్యకుమార్‌, నాగులపల్లి వీరబాబు, చిక్కాల శ్రీను, గారపాటి తాతబ్బాయి, ఉండమట్ల ప్రభాకర్‌, రామచంద్రరావు, వాసాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డి దొరబాబు, వనమాలి శ్రీను, వాకలపూడి అరుణకుమార్‌, నూకపెయ్యి ప్రసాద్‌, పల్లపు రాజేష్‌, చిన్నం ప్రసాద్‌, బచ్చల కిరణ్‌, కె పవన్‌, పల్లపు అజయ్‌, పెనుమాటి పవన్‌, పెనుమాటి అవినాష్‌, తాడి సతీష్‌ లతో పాటు పలువురు యువత పార్టీలో చేరారు.

కాతేరులో టీడీపీ సమావేశం

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గన్ని కృష్ణ తెలిపారు. రూరల్‌ మండలం కాతేరులో సీనియర్‌ నాయకులు గంగిన హనుమంతరావు ఆధ్వర్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన గన్ని కృష్ణ మాట్లాడుతూ ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయకుండా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతీఒక్కరూ బలపరచాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బూత్‌కమిటీ సభ్యులు, ఇన్‌చార్జులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, రూరల్‌ నాయకులు బిక్కిన సాంబ పాల్గొన్నారు.

ఎన్డీయే కూటమికే అన్నివర్గాల మద్దతు

అనపర్తి ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి, ఏప్రిల్‌ 28 : వైసీపీ మోస పూరిత మాటలు నమ్మి దగాపడ్డ అన్ని వర్గాల ప్రజలు ఎన్డీయే కూటమికి మద్దతు పలుకుతున్నారని వచ్చే ఎన్నికలలో ఎన్డీయే కూటమి విజయానికి సహకరిస్తున్నారని అనపర్తి నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్ధ్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తి మండలం రామవరంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బుంగ సంజయ్‌ జిల్లా నాయకులతో కలిసి నల్లమిల్లికి మద్దతు ప్రకటించారు. సంజయ్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దళితులకు తీరని అన్యాయం చేసిందన్నారు. తమకు అందాల్సిన నిధులను దారి మళ్లించడమే కాకుండా 27 పథకాలను రద్దు చేసి తీరని అన్యాయం చేసిందన్నారు. వచ్చే ఎన్నికలలో దళితులంతా ఎన్డీయే కూటమి విజయానికి కృషి చేస్తావ న్నారు.

నియోజవకర్గంలో ప్రచారంలో ఎన్డీయే కూటమి

అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి విజయం కోసం అటు నేతలు ఇటు కార్యకర్తలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రంగంపేట మండలంలో దొడ్డిగుంట, వెంకటాపురం, ఈలకొలను గ్రామాల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించ గా అనపర్తిలోని బాపనమ్మగుడి ఏరియా, శివాలయం వీధి, పాత హరిజనపేట ప్రాంతాల్లో నల్లమిల్లి సతీమణి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అదే విధంగా బిక్కవోలులో నల్లమిల్లి తనయుడు మనోజ్‌రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో నల్లమిల్లి తనయ డాక్టర్‌ సనాతని ఇంటింటా ప్రచారం నిర్వహించి కమలం గుర్తుపై అటు ఎంపీ అభ్యర్ధి అభ్యర్ధి పురందేశ్వరిని, ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తుంది. ఈ సందర్భంగా నల్లమిల్లి సతీమణి మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని వైసీపీ ప్రభుత్వ ధోరణికి ప్రజలు విసుగుచెందారని ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

రంగంపేటలో రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం

రంగంపేట, ఏప్రిల్‌, 28: అనపర్తి నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం రంగంపేట మండలంలో గల దొడ్డిగుంట, వెంకటాపురం, ఈలకొలను గ్రామాల్లో ఇంటిం టికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని రాక్షసపాలన నుంచి రక్షించుకోవాలన్నారు. దొడ్డిగుంట, వెంకటాపురం, ఈలకొలను గ్రామాల్లో ప్రజలు రామకృష్ణారెడ్డికి ఘనస్వాగతం ప

Updated Date - Apr 29 , 2024 | 01:00 AM