Share News

ఆరంభం ఘనం.. అమలు శూన్యం

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:54 PM

సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రజల సమక్షంలో ఇచ్చిన హామీ.. ఎన్నికలకు ముందు హడావుడిగా ఎమ్మెల్యే శంకుస్తాపన.. కట్టిన గోడ పగలుకొట్టి హడావుడిగా ప్రారంభించిన పనులు.. నేటికీ దానివైపు చూసిన వారే లేరు..

ఆరంభం ఘనం.. అమలు శూన్యం
నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రం

  • 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపనతోనే సరి

  • నిడదవోలులో ప్రారంభం కాని పనులు

  • నేటికీ ఖరారు కాని డ్రాయింగ్‌

నిడదవోలు, ఏప్రిల్‌ 28: సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రజల సమక్షంలో ఇచ్చిన హామీ.. ఎన్నికలకు ముందు హడావుడిగా ఎమ్మెల్యే శంకుస్తాపన.. కట్టిన గోడ పగలుకొట్టి హడావుడిగా ప్రారంభించిన పనులు.. నేటికీ దానివైపు చూసిన వారే లేరు.. వివరాల్లోకి వెళితే.. నిడదవోలులో ఉన్న 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(ప్రభుత్వాసుపత్రి) 100 పడకల ఆసుపత్రిగా స్థాయిని పెంచి పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తామన్నది సీఎం జగన్‌ నిడదవోలు ప్రజలకు ఇచ్చిన హామీ. దీంతో ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు 100 పడకల ఏరియా ఆసుపత్రికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా శంకుస్థాపన చేశారు. సుమారు రూ.19 కోట్ల నాబార్డ్‌ నిధులతో నిర్మాణానికి కాంట్రాక్టరు ముందుకు వచ్చాడు. పనులు ప్రారంభించేందుకు ఆసుపత్రి పైఅంతస్తులో ఉన్న పిట్ట గోడను సైతం రెండు రోజులపాటు పగలుకొట్టారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికార్ల నుంచి నేటికి డ్రాయింగు (డిజైన్‌) రాకపో వడంతో పనులు ప్రారంభం కావడం లేదు. అయితే డిజైన్‌ రాకుండానే స్థానిక ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నా యుడు శంకుస్థాపన చేసేసారు. శంకుస్థాపన చేసిన బోర్డును సైతం ఓ గదిలో భద్రప రిచారు. వైద్య ఆరోగ్య శాఖ అధికా రుల నుంచి డిజైన్‌ ఖరారై వస్తుం దా.. తిరిగి పనులు ప్రారంభమవు తాయా, జగన్‌ హామీ నెరవేరేనా, 100 పడకల ప్రభుత్వాసుపత్రి ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలందేనా అంటూ ప్రజలు నిట్టూర్పులు విడుస్తున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:54 PM