Share News

నామినేషన్ల దాఖలులో నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:33 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 15: నామినేషన్ల దాఖలు సమయంలో ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా జాయింట్‌ కలెక్టరు, పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి రాంసుందర్‌రెడ్డి సూచించారు. నామినేషన్ల పక్రియ ప్రారంభం కానున్న నేపధ్యంలో సోమవారం పిఠాపురంలోని ఆర్వో కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18నుంచి 25 వరకూ సెలవులు మినహా ఉదయం

నామినేషన్ల దాఖలులో నిబంధనలు పాటించాలి
పిఠాపురం సమావేశంలో జేసీ

జేసీ రాంసుందర్‌రెడ్డి

పిఠాపురం, ఏప్రిల్‌ 15: నామినేషన్ల దాఖలు సమయంలో ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా జాయింట్‌ కలెక్టరు, పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి రాంసుందర్‌రెడ్డి సూచించారు. నామినేషన్ల పక్రియ ప్రారంభం కానున్న నేపధ్యంలో సోమవారం పిఠాపురంలోని ఆర్వో కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18నుంచి 25 వరకూ సెలవులు మినహా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గం టల వరకూ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని జేసీ తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి ముందుగా వచ్చిన వారి నామినేషన్‌ ముందుగా స్వీకరిస్తామని, సమయం కోసం ముందస్తు అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అయిదుగురిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. నామినేషన్ల పరిశీలన 26న, ఉపసంహరణకు 29న మధ్యాహ్నం 3గంటల వరకూ అవకా శం ఉందని చెప్పారు. కాకినాడ డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ నామినేషన్ల దాఖలు ర్యాలీ నిర్వహిస్తే అందులో పాల్గొనే వ్యక్తుల సంఖ్య, వాహనాల వివరాలు, రూట్‌ మ్యాప్‌తో సహా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ర్యాలీలో ఏ ఇబ్బంది తలెత్తినా అందుకు నిర్వాహకుడే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

Updated Date - Apr 16 , 2024 | 12:33 AM