Share News

కూటమి విజయం ఖాయం : తంగెళ్ల

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:30 AM

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 15: వైసీపీ కార్యాలయాల వద్ద జనాలు లేక, డబ్బులిచ్చి కార్యకర్తలు, వలంటీర్లను తిప్పుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం ఖాయమని కాకినాడ పార్లమెంట్‌ జనసేన కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం సర్పవరంలో పార్టీ నా

కూటమి విజయం ఖాయం : తంగెళ్ల

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 15: వైసీపీ కార్యాలయాల వద్ద జనాలు లేక, డబ్బులిచ్చి కార్యకర్తలు, వలంటీర్లను తిప్పుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం ఖాయమని కాకినాడ పార్లమెంట్‌ జనసేన కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం సర్పవరంలో పార్టీ నాయకుడు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో టీడీపీ-బీజేపీ నాయకులు,కార్యకర్తల ఆత్మీయ సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా తంగెళ్ల మాట్లాడుతూ వైసీపీ గెలవడం సాధ్యం కాదని కార్యకర్తలకు తెలిసిపోయిందని, దాంతో వలంటీర్లు రాజీనామాలు చేయండి డబ్బులిస్తామంటూ బలవంతంగా తిప్పుకుంటున్నారని విమర్శించారు. వైసీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, ఎంపీగా తనకు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు. పలువురు గ్రామస్థులకు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల పార్టీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్‌ స్టేట్‌ డైరెక్టర్‌ దివవహి పేర్రాజు (పేరుబాబు), మాజీ సర్పంచ్‌ బొండాడ విజయ లక్ష్మణ్‌, ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌ పుల్ల శేషయ్య, టీడీపీ నాయకులు కట్టా గోపాల్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు మామిడాల శ్రీనివాసరావు, జనసేన నాయకులు ముద్ధన సూర్యప్రకాశరావు, పుల్ల వీరబాబు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:30 AM