Share News

మత్స్యకార గ్రామాల్లో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:29 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 15: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకార గ్రామాల్లో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు చేపడతామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పార్టీ మత్స్యకార విభాగం, కొత్తపల్లి మండల నాయకులు సోమవారం పిఠాపురంలో నాగేం

మత్స్యకార గ్రామాల్లో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

పిఠాపురం, ఏప్రిల్‌ 15: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకార గ్రామాల్లో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు చేపడతామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పార్టీ మత్స్యకార విభాగం, కొత్తపల్లి మండల నాయకులు సోమవారం పిఠాపురంలో నాగేంద్రబాబును కలిశారు. ఫార్మా కంపెనీల వల్ల వచ్చే వ్యర్థాలతో సముద్రపు నీరు కలుషితమవుతున్నదని, ఓఎన్‌జీసీ కంపెనీ ఆయిల్‌ తీత కారణంగా మ త్స్య సంపద తగ్గిపోతుందని నాగబాబు దృష్టికి తీసుకువచ్చారు. వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు జీవనభృతి చెల్లించాలని నాగబాబు డిమాండ్‌ చేశారు. సముద్రతీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారుల సంక్షేమం, భద్రతకు కనీస చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార వికాస విభాగం అధ్యక్షుడు మల్లాడి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంక కొండబాబు, అమల, సోదే రవికిరణ్‌, సూరాడ శ్రీను, పల్లేటి దేవుడు, సింహాద్రి, మెరుగు ఇజ్రాయిల్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:29 AM