Share News

వలంటీర్ల రాజీనామా

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:34 AM

గొల్లప్రోలు రూరల్‌/పిఠాపురం, ఏప్రిల్‌ 15: గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 3 సచివాలయాల పరిధిలోని 72మంది గ్రామ వలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామాలను ఆయా సచివాలయ అడ్మిన్‌లకు అందజేశారు. అలాగే పిఠాపురం పట్టణంలోని వార్డు సచివాలయం పరిధిలో 12మంది,

వలంటీర్ల రాజీనామా

గొల్లప్రోలు రూరల్‌/పిఠాపురం, ఏప్రిల్‌ 15: గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 3 సచివాలయాల పరిధిలోని 72మంది గ్రామ వలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామాలను ఆయా సచివాలయ అడ్మిన్‌లకు అందజేశారు. అలాగే పిఠాపురం పట్టణంలోని వార్డు సచివాలయం పరిధిలో 12మంది, 3,5,6 సచివాలయాలు నుంచి ఒక్కొక్కరు వంతున 15మంది వార్డు వలంటీర్లు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఆమోదించి ఉన్నతాధికారులకు నివేదించామని కమిషనరు కనకారావు తెలిపారు.

పెద్దాపురం: పట్టణ పరిధిలో 21 మంది వార్డు వలంటీర్లు,మండల పరిధిలోని వడ్లమూరు, ఉలిమేశ్వరం, తిరుపతి గ్రామాలకు చెందిన 32 గ్రామ వలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ కేవీ పద్మావతి, ఎంపీడీవో మాదిరెడ్డి ఉషారాణీ తెలిపారు.

ఏలేశ్వరం: ఏలేశ్వరంలో 60మంది వలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను మున్సిపల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌కు అందజేశారు.

Updated Date - Apr 16 , 2024 | 12:34 AM