Share News

జిల్లాలో హోమ్‌ ఓటింగ్‌ కోసం 69 బృందాలు ఏర్పాటు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:57 AM

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హోమ్‌ ఓటింగ్‌కోసం ప్రత్యేకంగా 69 బృందాలు ఏర్పాటుచేశామని జిల్లా ఎన్నికల అధికారిణి డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

జిల్లాలో హోమ్‌ ఓటింగ్‌ కోసం 69 బృందాలు ఏర్పాటు

జిల్లా ఎన్నికల అధికారిణి డాక్టర్‌ మాధవీలత

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 28: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హోమ్‌ ఓటింగ్‌కోసం ప్రత్యేకంగా 69 బృందాలు ఏర్పాటుచేశామని జిల్లా ఎన్నికల అధికారిణి డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. 85 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులు వారి ఓట్లను వారివారి ఇళ్ల వద్దే వేసేవిధంగా చర్యలు తీసుకున్నామనారు. అందుకోసం 400 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఏడు అంసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్లు నిండిన వృద్ధులు 8294 మంది, 40 శాతం దివ్యాంగత్వం కలిగిన 19754 మంది ఓటర్లు ఉండగా వారికి ఫారం 12 ఢీ పంపిణీ చేశామన్నారు. అందులో 85 ప్లస్‌ కేటగిరిలో 648, పీడబ్ల్యూడీ కేటగిరిలో 658 మంది, ఫారం 12డి అందజేసినట్లు తెలిపారు. హోం ఓటింగ్‌ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 69 రూట్స్‌ ద్వారా ఆయా ఎన్నికల సిబ్బంది తొలివిడతగా మే 2న, రెండోవ విడతగా మే 8న క్షేత్ర స్థాయిలో పర్యటన చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఓటర్లకు ముందస్తుగా సమాచారం ఇవ్వ నున్నట్లు తెలిపారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలో 85 ప్లస్‌ వారు 186 మంది, దివ్యాంగులు 222 మంది ఉన్నారు. రాజానగరం పరిధిలో 85 ప్లస్‌ వారు 33 మంది, దివ్యాంగులు 67 మంది ఉన్నారని, రాజమహేంద్రవరం సిటీలో 85 ప్లస్‌ వారు 142మంది, దివ్యాంగులు 65 మ ంది ఉన్నారని, రాజమహేంద్రవరం రూరల్‌ పరిధిలో 85 ప్లస్‌ వారు 51 మంది, దివ్యాంగులు 56 మంది ఉన్నారని, కొవ్వూరులో 85 ప్లస్‌ వారు 66 మంది, దివ్యాంగులు 66 మంది ఉన్నారని, నిడదవోలులో 85 ప్లస్‌ వారు 130 మంది, దివ్యాంగులు 145 మంది ఉన్నారని, గోపాలపురంలో 85 ప్లస్‌ వారు 40 మంది, దివ్యాంగులు 37 మంది ఉన్నారని వారి కోసం హోమ్‌ ఓటింగ్‌ బృందాలు, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.

మే 1న పింఛన్ల పంపిణీ

సచివాలయాలకు రావద్దు :కలెక్టర్‌

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 28(ఆంధ్ర జ్యోతి): మే 1నుంచి 5 తేదీ వరకు సామా జిక భద్రత పింఛన్లు అందజేయడానికి ఎ న్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం చ ర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ మాధవీ లత పేర్కొన్నారు. దివ్యాంగులు, అనారోగ్య కారణాలవల్ల మంచానికే పరిమితమైనవా రు, సైనిక కుటుంబాలు తదితర ప్రత్యేక కేటగిరీలకు ఇంటి వద్దకే పింఛను పంపిణీ ఉంటుందన్నారు. మిగితా వారికి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారన్నారు. బ్యాంక్‌ ఖాతా లు లేనివారికి సచివాలయ సిబ్బంది ఇం టికి తీసుకువచ్చి పంపిణీ చేస్తారన్నారు. పింఛన్ల కోసం ఎవరూ సచివాలయాలకు రావద్దన్నారు. మే1న సెలవు దినం అయిన ప్పటికీ చెల్లింపులు జరిగేలా రాష్ట్రస్థాయి అధికారులు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వివరించారు.

ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి

జిల్లా ఎన్నికల పరిశీలకుడు బలరామ్‌మీనా

బిక్కవోలు, ఏప్రిల్‌ 28: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా పోలీసు ఎన్నికల పరిశీలకుడు బలరామ్‌మీనా పోలీసులకు సూచించారు. ఆదివారం ఆయన బిక్కవోలు కెనాల్‌రోడ్‌లో వంతెనవద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టును పరిశీలించారు. ఈసందర్భంగా అనపర్తి సర్కిల్‌ పరిధిలో అనపర్తిలో రూ.94వేలు, రంగంపేటలో 22.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ శివగణేష్‌ ఆయనకు వివరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఎటువంటి పత్రాలు లేకుండా రూ.50వేలకు మించిన నగదును, బిల్లులు లేకుండా వున్న గిఫ్ట్‌ ఆర్టికల్స్‌, మద్యం వంటి వాటిని సీజ్‌ చేయాలన్నారు. ఈయన వెంట రాజమహేంద్రవరం డీఎస్పీ కిషోర్‌కుమార్‌, బిక్కవోలు ఎస్‌ఐ పి.బుజ్జిబాబు ఉన్నారు.

లికారు.

Updated Date - Apr 29 , 2024 | 12:57 AM