Share News

ఏపీసెట్‌కు 5452 మంది హాజరు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:17 AM

రాజమహేంద్రవరం రీజినల్‌ పరిధిలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్‌)కు 5452 మంది అభ్యర్థులు హాజరయ్యారని, పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఏపీ సెట్‌ రాజమహేంద్రవరం రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య వై.శ్రీనివాసరావు తెలిపారు.

ఏపీసెట్‌కు 5452 మంది హాజరు

దివాన్‌చెరువు, ఏప్రిల్‌ 28: రాజమహేంద్రవరం రీజినల్‌ పరిధిలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్‌)కు 5452 మంది అభ్యర్థులు హాజరయ్యారని, పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఏపీ సెట్‌ రాజమహేంద్రవరం రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య వై.శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రీజియన్‌ పరిఽధిలో 11 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారన్నారు. దీనికి 6854 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా వారిలో 1402 మంది హాజరుకాలేదని చెప్పారు. 80 శాతం అభ్యర్థులు అనగా 5452 మంది హాజరై పరీక్ష రాశారన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు రాజమహేంద్రవరంలోని ఎస్‌.కె.వి.టి కళాశాల, శ్రీకందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సహాయ ప్రాంతీయ కోఆర్డినేటర్‌ ఎస్‌.లింగారెడ్డి పరీక్షా కేంద్రాలను సందర్శించారు.

Updated Date - Apr 29 , 2024 | 12:17 AM