Share News

వైసీపీ ఇంతే!

ABN , Publish Date - Apr 15 , 2024 | 02:16 AM

కుప్పంలో వైసీపీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఎమ్మెల్సీ భరత్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు.

వైసీపీ ఇంతే!

ఫ కుప్పంలో కోడ్‌ ఉల్లంఘన

కుప్పం, ఏప్రిల్‌ 14: కుప్పంలో వైసీపీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఎమ్మెల్సీ భరత్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. జగన్‌రెడ్డిపై గులకరాయి దాడికి నిరసనగా ధర్నా చేశారు. అంతకుముందు ర్యాలీగా వచ్చారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ధర్నా చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ ఫోన్‌ ద్వారా ఎన్నికల అధికారి జి.శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. వీడియోలు, ఫొటోలు వాట్సాప్‌ ద్వారా పంపించారు. రిటర్నింగ్‌ అధికారిని వివరణ కోరగా.. కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ధర్నాలు, నిరసనలు చేసేందుకు అనుమతి లేదన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట వైసీపీ ధర్నా చేయడం కోడ్‌ ఉల్లంఘించడమేన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి, వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

‘బల్ల’లో సర్పంచి సహా 32మందిపై కేసులు

రామకుప్పం: ీరామకుప్పం మండలం బల్ల గ్రామంలో ఎన్నికల నియామవళిని ఉల్లఘించి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన సర్పంచు విజయ్‌థామస్‌, అతని తండ్రి, రెస్కో డైరెక్టరు థామస్‌, అనుచరుడు రవికుమార్‌తో పాటు 32 మందిపై ఆదివారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఆందోళన వీడియోలను గ్రామస్థులు కలెక్టరుకు పంపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్‌ నోడల్‌ అధికారి ఈశ్వరన్నను కలెక్టరు ఆదేశించారు. ఈశ్వరన్న తన బృందంతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయన ఫిర్యాదు మమేరకు 32మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు.

Updated Date - Apr 15 , 2024 | 02:16 AM