Share News

‘లెక్క’ తేలింది

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:02 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు తెరపడింది. చిత్తూరు పార్లమెంటు స్థానానికి ఇద్దరు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఐదుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

‘లెక్క’ తేలింది

- ఎన్నికల బరిలో 97 మంది అభ్యర్థులు

- పార్లమెంటుకు 19.. ఏడు అసెంబ్లీ స్థానాలకు 78మంది

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 29: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు తెరపడింది. చిత్తూరు పార్లమెంటు స్థానానికి ఇద్దరు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఐదుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల బరిలో 97 మంది మిగిలారు. చిత్తూరు, పలమనేరు, నగరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో ఒక్కరు కూడా నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు.

బరిలో మిగిలిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.

------------------------------------------------------------------------------------------------------

నియోజకవర్గం నామినేషన్లు విత్‌డ్రా రంగంలో వున్న

అభ్యర్థులు

------------------------------------------------------------------------------------------------------

చిత్తూరు పార్లమెంటు 21 02 19

అసెంబ్లీ స్థానాలు....

చిత్తూరు 13 00 13

పలమనేరు 14 00 14

నగరి 07 00 07

పూతలపట్టు 12 00 12

కుప్పం 15 02 13

పుంగనూరు 10 02 08

గంగాధరనెల్లూరు 12 01 11

------------------------------------------------------------------------------------------------------

మొత్తం 104 07 97

------------------------------------------------------------------------------------------------------

చిత్తూరు ఎంపీ స్థానానికి రెండు బ్యాలెట్‌ యూనిట్లు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 29 : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంటు స్థానానికి 19మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. 21మంది ఉండగా వారిలో ఇద్దరు సోమవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 19 మందికి కలెక్టర్‌ ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. రంగంలో 19 మంది ఉన్నందున రెండో బ్యాలెట్‌ యూనిట్‌ను వినియోగించడం తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం 2,200 అదనపు యూనిట్లు కావాలంటూ ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదన పంపింది. సాధారణంగా బ్యాలెట్‌ యూనిట్‌లో 16 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండేలా ఈవీఎంను రూపొందించారు. అంతకంటే అదనంగా అభ్యర్థులు ఉండడం, చివర్లో నోటాకు అవకాశం కల్పించాల్సి రావడంతో రెండో యూనిట్‌ ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

Updated Date - Apr 30 , 2024 | 07:48 AM