Share News

నేరాల అడ్డుకట్టకు బీట్‌ వ్యవస్థలను బలోపేతం చేయాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:50 AM

నేరాల అడ్డుకట్టకు రాత్రి, పగలు వేళల్లో పోలీస్‌ సిబ్బంది ద్వారా పర్యవేక్షిస్తున్న బీట్‌ వ్యవస్థలను ఎప్పటికప్పుడు బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

నేరాల అడ్డుకట్టకు బీట్‌ వ్యవస్థలను బలోపేతం చేయాలి

జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు

గంగాధరనెల్లూరు, ఏప్రిల్‌ 15: నేరాల అడ్డుకట్టకు రాత్రి, పగలు వేళల్లో పోలీస్‌ సిబ్బంది ద్వారా పర్యవేక్షిస్తున్న బీట్‌ వ్యవస్థలను ఎప్పటికప్పుడు బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పోలీస్‌ అధికారులను ఆదేశించారు. గంగాధరనెల్లూరు పోలీ్‌సస్టేషన్‌ను సోమవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈసందర్భంగా ఆయన రోడ్డుప్రమాదాలు, హత్యలు, హత్యాయత్నాలు తదితర కేసుల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన పెండింగ్‌ కేసుల వివరాలు, నిందితుల అరెస్ట్‌, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై ఆరాతీశారు. కేసులను త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిర్దేశిత కాలవ్యవధిలో కోర్టులో చార్జిషీట్‌ ఫైల్‌చేసి నిందితులకు కఠినశిక్షపడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్టేషన్లలో పనిచేసి సిబ్బంది సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ తనిఖీలో గంగాధరనెల్లూరు సీఐ శంకర్‌, ఏఎ్‌సఐ ఆంజనేయులురెడ్డి, పోలీ్‌ససిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:50 AM