Share News

లీసెస్టర్‌ వర్సిటీతో అపోలో ఒప్పందం

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:52 AM

యూకలోని లీసెస్టర్‌ యూనివర్సిటీతో చిత్తూరు అపోలో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది.

లీసెస్టర్‌ వర్సిటీతో అపోలో ఒప్పందం
అపోలో, లీసెస్టర్‌ యూనివర్సిటీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చూపుతున్న ప్రతినిధులు

చిత్తూరు రూరల్‌, ఏప్రిల్‌ 15: యూకలోని లీసెస్టర్‌ యూనివర్సిటీతో చిత్తూరు అపోలో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. లీసెస్టర్‌తో కలిసి అపోలో యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన క్రమంలో సోమవారం ఈ వర్సిటీలు ఒప్పంద కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా అపోలో వర్సిటీ వీసీ వినోద్‌భట్‌ మాట్లాడుతూ.. యూకే, భారతదేశాల మధ్య విద్య, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి రెండు యూనివర్సిటీలు జతకట్టాయన్నారు. ఇందులో భాగంగా రెండు సంస్థలు ఒక కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు వివరించారు ఈ కార్యక్రమం ద్వారా చిత్తూరులోని అపోలోలో రెండు సంవత్సరాల కోర్సు చేశాక.. చివరి సంవత్సరం లీసెస్టర్‌లో కోర్సును పూర్తి చేసి ఆ యూనివర్సిటీ పేరుతోనే పట్టా పొందవచ్చన్నారు. తక్కువ ఖర్చుతో విదేశీ విద్యను పొందవచ్చని తెలిపారు. అపోలో యూనిట్‌ హెడ్‌ నరే్‌షకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదటగా 120 మంది విద్యార్థులతో ఈ కోర్సును ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. బోర్డు నుంచి ఎంపీసీ, డిప్లొమా కోర్సులో 50 శాతంమార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు నేరుగా అడ్మిషన్లు పొందవచ్చన్నారు. చదువు కోసం అపోలో సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు. హెల్త్‌ కేర్‌, డేటా సైన్స్‌ రంగాలలో విద్యా, పరిశోధన శక్తిని ఉపయోగించి వాస్తవిక ప్రపంచంలో మార్పులు తీసుకురావాలన్నది తమ భాగస్వామ్య లక్ష్యమని లీసెస్టర్‌ వీసీ హన్రిట్టా ఓ కానర్‌ పేర్కొన్నారు. లిసెస్టర్‌ డిప్యూటీ వైస్‌ ఛాన్సరల్‌ కెర్రీ లా, అపోలో రిజిస్ట్రార్‌ పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:52 AM