Share News

పోస్టల్‌ బ్యాలెట్‌కు 22,416 దరఖాస్తులు

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:51 AM

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌కు 22,416 దరఖాస్తులందాయి.జిల్లావ్యాప్తంగా 15,936మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో వుండగా హోం ఓటింగ్‌కు అర్హులైన వారు కూడా ఫారం 12, 12డి దరఖాస్తులను జిల్లా అధికారులకు అందజేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌కు 22,416 దరఖాస్తులు

ఫ హోమ్‌ ఓటింగ్‌కు 1,139

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 29 : జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌కు 22,416 దరఖాస్తులందాయి.జిల్లావ్యాప్తంగా 15,936మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో వుండగా హోం ఓటింగ్‌కు అర్హులైన వారు కూడా ఫారం 12, 12డి దరఖాస్తులను జిల్లా అధికారులకు అందజేశారు. సోమవారం నాటికి జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 22,416 మంది దరఖాస్తు చేశారు. పోలింగ్‌ కేంద్రానికి రాలేని 85ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, 45శాతం పైబడి వికలత్వం ఉన్న దివ్యాంగులు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 5, 6 తేదీల్లో ఇంటి వద్దనే వీరు ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.ప్రత్యేక పోలింగ్‌ కేంద్రానికి వెళితే అక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వడం, ఓటు హక్కును వినియోగించుకుని బ్యాలెట్‌బాక్సులో వేయడం అంతా ఒకేసారి జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 5,351మంది ఉద్యోగులకు తిరుపతి బాలాజీకాలనీలోని ఎస్వీయూ క్యాంపస్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 30 , 2024 | 01:51 AM