Share News

AP Elections: ఎన్నికల వేళ.. రాజేంద్రనాథ్‌కు తప్పని తిప్పలు

ABN , Publish Date - May 08 , 2024 | 05:10 PM

డోన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఈ సారి ఎదురు గాలి వీస్తుందని ఓ చర్చ అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే ఎన్నికైన ఆయన.. ముచ్చటగా మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

AP Elections: ఎన్నికల వేళ.. రాజేంద్రనాథ్‌కు తప్పని తిప్పలు

కర్నూలు, మే 08: డోన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఈ సారి ఎదురు గాలి వీస్తుందని ఓ చర్చ అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే ఎన్నికైన ఆయన.. ముచ్చటగా మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే అవి వికటించే అవకాశం ఉందని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు. జగన్ ప్రభుత్వంలో ఆయన కీలక శాఖ మంత్రిగా ఉండడంతో.. ఈ అయిదేళ్లలో ప్రజలకు ఆయన అందుబాటులో లేరని జిల్లా వాసులు చెబుతున్నారు.

Foreign Tour: విదేశాలకు వైఎస్ జగన్ దంపతులు

అలాగే జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సైతం ఆయన ఓటమికి కారణమవుతుందని అంటున్నారు. మరోవైపు డోన్ నుంచి కూటమి అభ్యర్థిగా కోట్ల విజయభాస్కరరెడ్డిని బరిలో నిలిచారు. ఆయనకు జిల్లాపై మంచి పట్టు ఉంది. అలాగే దశాబ్దాల క్రితమే ఆయన ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ఇక డోన్‌లో నాపరాయి పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది.


ఆ క్రమంలో ఆర్థిక మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా ఆయన చొరవ చూపలేదనే విమర్శ వినిపిస్తుంది. మరోవైపు ఆర్థిక మంత్రిగా బుగ్గన.. సంక్షేమ పథకాల కోసం ప్రతీ సారి అప్పులు కోసం.. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయానికి వయా దేశ రాజధాని ఢిల్లీ మీదగా వెళ్లిరావడంతోనే సరిపోయేదనే ఓ ప్రచారం అయితే వెలగపూడిలోని సచివాలయం సాక్షిగా నేటికి నడుస్తుంది. అలాంటి వేళ ఆయన నియోజకవర్గంలో కంటే.. రాజధాని అమరావతి ప్రాంతంలో కంటే.. ఢిల్లీ లేదా ముంబైలోనే అప్పుల వేట కోసం ప్రయత్నాలు చేశారనే ప్రచారం ఉంది.

LokSabha Elelctions: రాయ్‌బరేలీలో కొత్త శకం ఆరంభం: ప్రియాంక

దీంతో డోన్ నుంచి ఎమ్మెల్యేగా ముచ్చటగా మూడోసారి ఆయన గెలుస్తారా?... అంటే సందేహమేనని కర్నూలు జిల్లా వాసులు పేర్కొంటున్నారు. అదీకాక.. సీఎం వైయస్ జగన్ మనస్సు గెలుచుకొన్న అతి కొద్దిమందిలో బుగ్గన ఒకరని.. అందుకే ఆయన తన తొలి, మలి కేబినెట్‌లో బుగ్గనకు ఒకే శాఖను కేటాయించారనే ఓ చర్చ ఉంది. మరి అలాంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. డోన్ నియోజకవర్గ ప్రజల మనస్సులను మరోసారి గెలుచుకుంటారా? అంటే సందేహమేనని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 05:10 PM